పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

127


. కాదని నిరుత్సాహపరచిరి. దీనితో లఫయతు నిరుత్సాహ మును చెందలేదు. తనయుద్యమమును మానలేదు. తానే యొక యోడను సంపాదించెను. దానిలో తానే అమెరికాకు వాషింగ్టను సేనానియొద్దకు యుద్ధసామాగ్రులను తీసుకొని పోయెదనని కూడ చెప్పెను. పరాసు ప్రభుత్వమువారును ఆంగ్లేయ , ప్రభుత్వ మువారును నీయనను పోకుండ నాటంక పరచిరి గాని ఎటులనో తప్పించుకొని పన్నెండుమంది పరాసు సేనానులుగనున్న స్నేహితులతో బయలు దేరి స్పైన్ దేశమునుచేరి యచ్చటనుండి సముద్రముమీద పయనము చేసి, సురక్షితముగ దక్షిణ కొరోలీనా రాష్ట్రములోని జార్జి టౌను రేవు లో డిగెను. అక్కడనుండి యా పదగుగ్గురు పరాసు సేవాసులును ఫిలడిల్ఫియా పట్టణమును చేరిరి. కొంతకాలము వీరిని అమెరికను సేసలలో చేర్చుకొన లేదు. కాని వీరు జీతము లేకుండకూడ పనిచేసెదమని చెప్పినందున చేర్చుకొనిరి. 1777ను సంవత్సరము జులై 31 వ తేదీన వాషింగ్టను కొన్ని అమెరికను సేసలపై లఫయతు ప్రభువును 'మేజర జనరలగ నియమించెను. అప్పటినుండియు లఫయతు సేనాసి వాషింగ్టను సందు మిగుల గౌరవమును భక్తిని కలిగిన పరమమిత్రుడయ్యెను. ఈనెలలోనే యూరొపు ఖండములోని పోలండు దేశమునుండి కోసియజుకో యసు యువకుడు యింజనీయరుగ ( శిల్పశాస్త్రజ్ఞుడుగ) అమెరికాకు వచ్చి వాషింగ్టసుతో చేరెను. ఈ సమయముననే నొక యమెరికను స సైన్యము రోడు అయిలండు రాష్ట్రములో నుండియున్న ఆంగ్లేయ సేనపై యాకస్మికముగ