పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ఆధ్యాయము

125


లో ప్రవేశించి శీతకాలమచట గడపెను. అచటనుండి అక స్మాత్తుగా నింగ్లీషువారి పైబడి యోడించు చుండెను. వాషింగ్టనుయొక్క సైన్యములు బలపడుచుండెను. నూతన సైన్యములు వచ్చి చేరుచుండెను. కొలది కాలములో నాంగ్లేయులు న్యూజర్నీ రాష్ట్రమును పూర్తిగా ఖాళీ చేసి వెడలిపోయిరి.


అమరికను సైన్యముల నెక్కువ చేయుటకు ప్రయత్నములు జరుగుచుండెను. కొత్త సైనికులు చేరుచుండిరి. కాని చాలమంది పాత సైనికులు సైన్యములను వదలిపోవు చుండిరి. ఇంతలో స్పోటకజాడ్యము అమెరికను సైనికులలో వ్యాపించెను. ఇందునలన కొత్తవాటు చేయుటకు సంకోచించుచుండిరి. జీతము బాకీపడెను, 1వ జూన్ తేదిన తనకు కొత్తగ చేరుచున్న వారికంటే తనను వదలి పెట్టిపోవు చున్న పాతవారి సంఖ్య ఎక్కునగుచున్నదని వాషింగ్టను వ్రాసెను గాని న్యూజర్నీ రాష్ట్రములో నాంగ్లేయ సైనికులు చేయుచున్న దోపిళ్ళు జరుపుచున్న దుండగములు కొంతవరకు కసి తీర్చుకొనుట 'కమేరికను సైనికులను ప్రోత్సహించ సాగెను.

మానవ సాతంత్ర
వాదులు.


ఈ సమయమున ఆమెరికా స్వాతంత్ర్య యుద్ధము యూరవుండవుదృష్టి నాకర్షించినది, అమెరి కనుల పక్షమున యుద్దము చేయుటకు పరాసు దేశమునుండి కొందరు వచ్చి అమెరికను సేనలలో సుద్యోగములను పొందుచుండిరి. లఫయతు