పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ఆధ్యాయము

121


టయే చేయదగినపనియని నిశ్చయించిరి. సెప్టెంబరు 15వ తేదీన యుద్ధసామాగ్రులను ఫిరంగులను వదలి పెట్టి అమెరికను నేనలన్నియు న్యూయార్కును వదలిపోయెను. ఆంగ్లేయు సేనలు న్యూయార్కు పట్టణమునుజయప్రదముగా ప్రవేశించెను. అమెరికను సేనలను వాషింగ్టను న్యూయార్కుకు సమీపమున నున్న ఒక చిన్న మిట్ట మీద ప్రవేశ పెట్టెను. అక్కడ నొక కోటను నిర్మించెను. దానికి వాషింగ్టను కోటయని నామారణము చేసిరి.

(7)

వాషింగ్టన్ కోట
ఆంగ్లేయుల వశమయ్యెను.


దేశీయమహాజవసభవారు నాషింగ్టను కోరికపైన ఎనుబదియెనిమిది పటాలముల సైనికులను పోగు చేయుటకు తీర్మానించిరి. వీరు యుద్ధము ముగియువరకును పనిచేయవలసియుందురు. ఈ లోపుగ వదలి పెట్టుటకు వీలులేదు. దవ్యమును భూములను సైనికులకు పారితోషికముగ నిచ్చెదమనికూడ ప్రకటించిరి. ప్రత్యేక రాష్ట్రములవారును ప్రత్యేక పట్టణమును కూడ నెక్కువ పారితోషికముల నిచ్చెదమని ప్రచురించిరి. ఈవిధముగ సైన్యములను పోగుచేయుచుండిరి. ఆంగ్ల సేన లింతలో పోయి నవంబరు 18 వ తేదీని వాషింగ్టను కోటపై బడెను. అమెరికనులు హడ్సను నదిని దాటకుండుటకై రెండు ఆంగ్లేయు నావలు హడ్సను నదిలో నుంచిరి. వాషింగ్టను కొన్ని సేనలను వాషింగ్టనుకోటలో నిలిపి మిగిలిన సైన్యములతో న్ హయిటుప్లైమ.