పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సంయుక్త రాష్ట్రములు ఆమెరికనులు పారిపోయిరి. త్రోవలో జాడ్యమువలననూ. తిండి లేకను శత్రువులవలనను అనేకులు మరణించిరి. కొందరు. ఆత్రువులచే జిక్కిరి. బహుస్వల్ప సంఖ్య మిగుల దౌర్భాగ్మగు స్థితిలో కనడా సరిహద్దును దాటి అమెరికను రాష్ట్ర ములలో ప్రవేశించెను.


{అమెరికను సైనికుల
దౌర్భాగ్యస్థితి

బాస్టను స్వాధీనమయిన తరువాత వాషింగ్టను న్యూయార్కు పట్టణమును తన సైన్యములకు ముఖ్య స్థానముగా చేసికొనెను. న్యూయార్కు సందు కొంద రాంగ్లేయుల యందు , భక్తిగల వారు గలరు. ఇది మిక్కిలి అపాయకరమైన స్థితి కాన వాషింగ్టను న్యూయార్కు సంరక్షణకై కోటలను నిర్మించెను. గాని ఆయన క్రింద నుండిన సైన్యములు మిగుల హీనస్థితిలో నుండెను. ఏడు వేలమంది సైనికులు మాత్రముండిరి. ' ఆయుధ సామగ్రి జాలదు. ద్రవ్యము లేదు. దుస్తులు లేవు. సైనికు లిండ్లకుపోవుటకు తొందర పడుచుండిరి. ఇంతలో అమెరికను సైన్యములలో కొందరాంగ్లేయుల పక్షము నచేరుటకు కుట్ర సలిపినట్లు కూడ బయల్పడెను. విచారణ చేసి కుట్రదార్లలో ముఖ్యులను సైనికాధి కార్లును ఉతీసి.. జూన్ నెల చివరభాగమున మూడు సంవ త్సరములవరకుగాని లేక యుద్దమాఖరగువరకు గాని కొలువు లోనుండు షరతుతో సైనికులను పోగుచేయుటకు దేశీయ సభవారు తీర్మానించిరి. జూన్ 29వ తేదీన నలుబది యెదు. ఆంగ్లేయనౌకలు ముప్పది వేల మంది సైనికులతో సాండిహుకు రేవులో దిగెను. ఇంకను కొన్ని యోడలువచ్చు సమాచారము కూడ తెలిసెను, ఈ సంగతి వాషింగ్టను దేశీయమహా