పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఏడవ అధ్యాయము

{రాష్ట్రములలో స్వతంత్ర
ప్రకటనములు.}

యప్రభుత్వము కూలిపోవుచుండెను. 26 వ మార్చి తేదీన దక్షిణ కారోలీనా రాష్ట్రము స్వతంత్ర ప్రభుత్వమును స్థాపించుకొనెను. ఉత్తర కారొలీనా రాష్ట్రములోని న్యాయస్థానము తెరవగ నే ప్రధాన న్యాయాధిపతి ' ఆంగ్లేయరాజు మూడవ జూర్జిప్రభుత్వ విసర్జనము చేసెననియు మమీదనాయన కేట్టి. యధికారము లేదనియు మన మాయని కెట్టి రాజభక్తినిచూప నవసరము లేదనియు” ప్రకటించెను, 4 వ మే తేదీన రోడు అయిలాండు లోని ప్రప్రజాప్రపతినిధిసభవారు” ఈ రాష్ట్రములోని ప్రజ లాంగ్లేయ రాజునకు లోబడిన పాలితులు కారు " అని ప్ర కటించిరి. 6వ తేదీన” ఆంగ్లేయ రాజు చేతను పార్లమెంటు తమకుగల అరాదిసిద్ధమగు హక్కులు భగ్నము కావింపబడినందున వారితో నెట్టి సంబంధము తమకు లేదని" పర్జీనియా రాష్ట్రీయసభవాగు తీర్మానించిరి. మే 15 వ తేదీన అమెరికాసంయుక్త రాష్ట్రములు ఆంగ్లేయరాజుకును పార్లమెంటుకును లో బడని స్వేచ్ఛాయుతమైనట్టియు స్వాతంత మైనట్టి యూ రాష్ట్రములని ప్రకటించుటకు " దేశీయమహజనసభలో సుపపాదించవలసినదని వర్జీనియానుండి వెళ్లిన ప్రతినిధుల కాజ్ఞాపించిరి. జూ. 12వ తేదీన నొక సుప్రసిద్ధమైన హక్కుల ప్రకటనమును గావించిరి. దీనిని బట్టియే దేశీయమహాజన సభవారు 4 వ జులై తేదీన తమ ప్రకటనమును చేసిరి. ఇంతలో" అమెరికను రాష్ట్రముల ప్రజలు ఆంగ్లేయరాజు యొక్క పాలనమునందండుట న్యాయమునకును మనస్సాక్షి కీని వ్యతిరేక మయినందున ఆంగ్లేయ. పాలనమును పూర్తిగా కూలద్రోయట అత్యవసరమ”,ను.