పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఆమెరి ఆసంయుక్త రాష్ట్రములు


జులను కట్టి సంరక్షణ యత్త పరచుచుండెను. గొప్ప తుపాను కలిగి ఆంగ్ల నౌకాదళము నిష్ప్రయోజక మయ్యెను. అమెరికను సైన్యములు మిట్టప్రదేశములనుండి బాస్టనులోని ఆంగ్లేయ సైన్యములపై కాల్చుచుండెను. 17వ మార్చి తేదీన ఆంగ్లేయ సైన్యములు బాస్టను పట్టణమును వదలి వెళ్ళిపోయెను. మార్చి 20వ తేదీన వాషింగ్టను తన అమెరి కను సైన్యములతో పురవాసుల జయజయధ్వానముల మధ్య బాస్టసుపుర ప్రవేశము గావించెను. పదిరోజుల తరువాత బాస్టను 'రేవునకు సమీపముననున్న ఆంగ్లేయ నౌకాసైన్యము కూడ వెళ్ళిపోయెసు. న్యూ ఇంగ్లాడు రాష్ట్రసముదాయ మంతయు నింతటి నుంచి ఆంగ్లేయుల నుండి విముక్తి నిచెందెను.


దేశీయ మహాజన సభ వారి యుత్త రువుల ననుసరించి అమెరికను యుద్ధనౌకలు ఆంగ్ల యోడలను వెంబడించుచు తరుముచుండెను.' ఐర్లాండు దేశవు నౌకల జోలికి పోవుట లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రములలోనికి ఇంతటి నుండియు బాని సలను దిగుమతి చేయకూడ దని దేశీ యమహాజనసభ నిషేధించెను. ఏప్రిలు 6వ తేదీన "ఇంగ్లాండురాజునకు లోబడి యున్న ప్రదేశములు” గాక మిగిలిన యావ తృపంచముతోను స్వేచ్చగా వాణిజ్యము చేయుటకు దేశీమహాజనసభవారు తీర్మానించిరి. దీనితో అమెరికనుల వర్తక స్వాతంత్యము పూర్తి యయ్యెను.

ఫాన్సువారి సహాయ మన్వేషించుటకొర రహస్య యుపసంఘ "మేర్పాటు చేయబడింది. ఆమెరికను రాయ