పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ అధ్యాయము

99


తనుచూపకూడదనియు తమ దేశమున కాయన గర్భశత్రువనియు మెసషు సిట్సు రాష్ట్రీయసభ వారు తీర్మానించిరి. " కొలది దినములలో నిరువది వేల అమెరికను సైన్యములు బాస్టను ను ముట్టడించి అందలియాంగ్లేయ సైన్యముల కాహారపదార్ధ ములు బయట నుండి రాకుండ చేసెను. దక్షిణమున చాల చూరమున నున్న యుత్తర కారొలీనా రాష్ట్రములోని యొక పట్టణ ప్రజలు తమ కాగ్లేయ గాజునందు రాజభక్తి లేదనియు స్వతంత్రమును పొందితిమనియు ప్రకటించిరి. -

{ఆంగ్లేయులు
లోబడుట

న్యూయార్కు రాష్ట్రములోని రెండువందల డెబ్బది మంది సైనికులను వెంటబెట్టుకొనిపోయి యీ ఆంగ్లేగులు .యీధను ఆలను అను అమెరికను సేనాని మే 10 వ తేదీన ఆకస్మికముగా ఆంగ్లేయుల స్వాధీనమం దున్నట్టి కొండరీనా యనుకోటను ముట్టడించెను. అందులోని ఆంగ్లేయ సేనాధిపతిని సైన్యములను భగవంతుని పేరను అమె రికా దేశీయ మహాజన సభా పీరను తనకు లోబడమని కోరెను. ఎదిరించుటకు శక్తి జాలక ఆంగ్ల సైన్యములోబడెను. సూట యిరువది రెండు ఫిరంగులు ను విశేష సంఖ్యగల పడవలును చాలగ నాయుధ సామగ్రులును తుపాకిమందును నాకోటలో కూడ అమెరికెనులవశమయ్యెను. రెం డుదినముల తరువాత నీ అమెరికను సైన్యములు ఎట్టిఆటంకము లేకుండ మరియొక కోటను లోబర్చుకొనిరి. మే 10 వతేదీన అమెరికా దేశీయ మహాజనసభ రెండవసారి ఫిలడల్ ఫియా పట్టణముస సమావేశమయ్యెను. వచ్చి ప్రతినిధులలో ముందు సంయుక్త రాష్ట్రముల కధ్యక్షులుకాబోవు వాషింగ్టన్ - -