పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

అమెరికా సంయుక్త రాష్ట్రములు


నెల 18వ తేదీన రాత్రి పదకొండు గంటలకు బంపెను. ఈసంగతి ప్రజలకు ముందుగనే తెలసి ఎదిరించుటకు సిద్ధపడిరి. కల్నలు స్మితు ముందు పంపిన పటాలమును బాస్టనుకు 10 మయిళ్ళ దూరముననున్న లెక్సంగ్టగన్ వద్ద ప్రజలసైన్యమడ్డగించెను. ఉభయులునొకరిపై నొకరు తుపాకీల నుగాల్చిరి. ఇంతలో స్మిత్తు యొక్క తక్కిన సైన్యములు వచ్చి చేరినందున ఆంగ్లేయ సైన్యము లుదయము ఏడుగంటలకు కంకార్టు గ్రామము చేరెనుగాని ఆయుధములలో కొద్దిభాగము మాత్రమే వారికి దొరకెను. ఇంతలో అమెరికను ప్రజా సైన్యములు వచ్చెను. అప్పుడు జరిగిన యుద్ధ ములో ఆంగ్లేయుల పక్షమున 65 మంది సైనికులు చనిపోయిరి. 180 మందికి గాయములు తగిలెను, ఇటువది ఎబమిది మంది అమెరికనుల చే ఖైదు చేయబడిరి. అమెరికనులలో యేబది తొమ్మిదిముంది మరణించిరి.ముప్పది తొమ్మిదిమందికి గాయములు తగిలెను. అయిదుగురు మాత్రము ఆంగ్లేయులచే జిక్కిరి. త రిబీతు నొందిన ఆమెరికను ఐచ్చిక భటులగు రైతులచే పరాజయము నొందినందున అంగ్లేయుల ఖ్యాతి నశించెను. అమెరికను సైనికులు వెంటనంటి తరుచుగా ఆంగ్ల సైనికులు పారిపోయిరి.

{పారిపోయెను
పారిపోయెను

జనరలు గాజు యొక్క సైన్యములు మిక్కిలి తొందరగా మూడుగంటలలో నిరువది మైళ్ల దూరము అమెరికనులు వెంబడించిరిగాని అంత తొందర గా పోజాలక వెనుకకు తగ్గిరి. ఇది యుద్దప్రారంభము.

దీనిలో దేశమునందంతటను గొప్పకలవరము జరిగెను. ఇంతటినుండియు తమగవర్నరగు జవరలు గాజున కెట్టి విధేయ