పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

అమెరికా సంయుక్త రాష్ట్రములు



స్వభావమును తిరిగిపొంది, సృష్టికర్త యొక్క యుద్దేశ్యములను నెరవేర్చవలెననియు నాయన ముఖ్య సిద్ధాంతము. “సృ షిలో అందరు సమానులు. ఎక్కువ తక్కువలు లేవు. స్వభావముగ నీతిగలవారు. శారీరదార్థ్య ముగల నారు. స్వేచ్ఛ గలవాడు, నాగరికత యనునది అసమానత్వమును అవినీతిని దెచ్చినది. శరీరదార్థ్యమునుకూడ పొడుచేసినది. కొద్దిమంది. స్వార్ధపరులు నాగరికత పేరున విశేష మందిని దాసులుగచేసి కొనినారు, కావున నాగరికతను నిస్మూలనము చేసి మనుష్యు లలో స్వభావజన్య మగునీతి; స్వతంత్రము , సమానత్వము లను తిరిగి స్థాపించవలెను. విద్యగల వారికన్న విద్య లేనివారును నాగరికు లకన్న అనాగరీకుల ను, భాగ్యవంతులకన్న బీద వారును ఎక్కువ నీతిమంతులు" అని ఆయన నాసెను. ఆయన రచించిన గ్రంధములలో ముఖ్యమయినవి "న్యూ హె లాయిసా” “ఎమిలీ” “సోషలుకంట్రాక్ట్” అను మూడు గ్రం ధములును వీటిని అతిఆత్రతతో ప్రజలు చదివిరి. ఆయన వ్రాసినమాటలు ఒక గొప్ప ప్రవక్తయొక్క సందేశములని ప్రజలు నమ్మిరి." గ్రామములను విడువవద్దు, బస్తీలలో చేసే పద్దు, బస్తీలలో చెడిపోవుటకు అనేక మార్గములుగ లవు. పల్లెటూళ్ళే స్వచ్చమయినవి. నీతిమంతమయినవి” అని ఆయన , వ్రాసెను. "" దైవాంశసంభూతులమని చెప్పి రాజులు ప్రజలను మోసము చేసి నిరంకుశముగ పాలించుచు దాసులుగచేసు కొనియున్నారు. పుట్ట కవల్లనే శ్రేష్టులమని ప్రభువులు ప్రజలను లోబరచుకొని దాస్యములో ముంచియున్నారు. ఈశ్వరుని ప్రతినిధులమని పలికి మతగురువులు ప్రజలను తమ పాద్యా క్రాంతులుగా చేసి