పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ అధ్యాయము

89



తరములనుంచి వచ్చిన కీడులను సంస్కరించ తగిన సామర్ద్యము గలవాడుకాడు. ఇంక ను వరాసుదేశ మే వాజ్మయములోను భావ ప్రపంచములోను యూరఫుఖండముసకు శిరోమణియైయుం డెను. యూరపులోని వివిధ ప్రభుత్వములవారి యంతర్జాతీయ వ్యవహారము లన్నియు పరాసుభాషలోనే జరుగుచుండెను, యూరవులోని అన్ని దేశ ప్రజలకును పరాసుభాష సామాన్య ముగా తెలిసియుండెను. , ప్రష్యా రాజు ఫ్రెడరికు డి గ్రేటుటు పరానుభాషలోనే కవిత్వమును వ్రాయుచుండెను. ఆంగ్లేయ రాజగు రెండవ జార్షి కల వాటుపడిన భాష పరాసు భాషయే సుప్రసిద్ధ చరిత్రకారుడగు గిబ్బను పరాసుభాషలోనే చరిత్రలు వ్రాయ నారంభించారు. వాల్టేరు ప్రతి దేశపు రాజుతోడను పరాసు భాషలో నే యాత్తర ప్రత్యుత్తరములు జరిపెను. ఇటలీ దేశము లోని సుప్రసిద్ధ నాటకకర్తలు పరాసుభాష లోనే వ్రాసిరి.. పరాసు భాషలో సున్న వాజ్మయము. శాస్త్ర సముదాయము అప్పటికి మరి యేభాషలోను లేకుండెను. పరాసు వాజ్మ యము నందా కాలమున మిలి పేరువడసిన గంధకర్తలిరువురు వాల్టేరు, రూసో వీరు , వ్రాసిన గ్రంధములను వీరుబోధంచిన సిద్ధాంతములను మానవచరిత్రములో నూతన శకమును ప్రారంభింపచేసినవి. వీరనేక గ్రంథములను రచించిరి. జీవిత. పరమార్గమును గూర్చియు వివిధ మనుష్యుల మధ్యను వివిధ మానవ సంఘములమధ్యను నుండవలసిన సంబంధములను గూర్చియు మానవులకుగల యభిప్రాయములలో సంపూర్ణ మగు మార్పును కలుగచేసిరి. వాల్టేరు పండితుడు కవిత్వము, నాటకములు, నవలలు, ప్రహసనములు, వ్యాసములు, ' చరి