పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

ఆరవ అధ్యాయము , పంచ పరిస్థితులు.

{1)

{ఆమెరికా.}

యుద్ధారంభమున చుట్టునున్న ప్రపంచ స్థితిగతు లెటు లున్నవో తెలిసికొనుట మూవశ్యకము. గ్వయగా దేశముతప్ప మిగిలిన దక్షిణ అమెరికా ఖండమంతయు స్పైన్, పోర్చుగలు, జాతులచే నాక్రమించ బడియుడినది. గ్వయనాదేశములో కొంత భాగము ఒలాందా (డచ్చి వారి క్రిందను కొంత భాగము షరాసువారిక్రింద నుండెను. ఉత్తర అమెరికా ఖండములో సుత్తరముననున్న కనడా దేశము లో నెక్కువభాగము పరాసువారి క్రిందను కొద్దిగా ఆంగ్లేయుల క్రిందను ప్రధమములో నుండినప్పటికిని 1757 మొదలు: 1768 వరకు జరిగిన ఏడు సంవత్సరముల యుద్ధములో పరానువా రోడిపోయినందున, 1783 వ సంవత్సరమున జరిగిన పారిసు సంధివలన, కనడా దేశ మంతయు ఫొస్సు వదలి వేసి ఆంగ్లేయు సభుత్వమునకు పశవరచెను. ఇంతటి నుంచియు కనడా దేశ మాగ్లేయ సామ్రాజ్యములో ముఖ్యమైన వలసరాజ్య మై