ఈ పుట ఆమోదించబడ్డది

5

చెప్పియున్నచో ద్వంద్వమున గడపటిపదముయొక్క లింగమే యన్నిటికి వచ్చును. కావున నట్లు ద్వంద్వము చెప్పలేదు. నభః ఖం శ్రావణోనభాః = సశ్శబ్దమునకు ఆకాశమనియును, శ్రావణ మాసమనియు నర్థము గలదు. ఈ యర్థములో మొదటి యర్థమున నపుంసకము. రెండవ యర్థమునందు బుల్లింగము, ఏక శేషము చెప్పిన నేలింగమున పదమున్నదో ఆ లింగమే వచ్చును. కాబట్టి యా దోషము రాకుండుటకై 'ఖశ్రావణౌ తు నభసీ ' యని చెప్ప బడలేదు. సమాన లింగములకును ఒక్క చోట లింగ నిర్ణయము చేయబడిన వానికిని ద్వంద్వైక శేషములు చెప్పబడినవి. 'స్వర్గనాకత్రిదినత్రిదశాలయాః' మరియొక చోట జెప్పబడని వైనను అన్నియు పుల్లింగములు కావున ద్వంద్వము చెప్పబడినది. 'అప్సరోయక్ష రక్షో గంధర్వ కిన్నరాః' ఇందు అప్సరస్ = స్త్రీ లింగము. యక్ష = పుల్లింగము. రక్షన్ = నపుంసక లింగము. గంధర్వ కిన్నర పదములు పుల్లింగములు. ఇవి యట్లు వేర్వేరు లింగములు కలవైనను, ఇతర స్థలము లందు వీనికి లింగములు నిర్ణయింప బడియుండుటంజేసి వ్వంద్వము చెప్పబడినది. క్రమము విడిచి సంకరమును చెప్పబడలేదు. అనగా బర్యాయములు చెప్పునపు డొక్క పుల్లింగము, ఒక నపుంసకము, ఒక స్త్రీ లింగము పదము లారంభింప బడునో, వానిని ముగించి పిమ్మట మరియొక లింగము పదము లారంభింప బడును. స్తవః స్త్రోత్రం స్తుతిర్నుతిః అను చోట, స్తవః అను పుల్లింగము, స్త్రోత్రం అను నపుంసకము, స్తుతిః, అను రెండు స్త్రీ లింగములు నొక్కటిగా జెప్పబడినవి గాని స్తుతిః స్త్రోత్రం స్వవో నుతిః అని చెప్పబడలేదు.

అవ
లింగములను విధించునపుడు లాఘవము కొరకు కొన్ని సంకేతములు:..
శ్లో
త్రిలిజ్గ్యాం త్రిష్వితి పదం మిథునేతు ద్వయే రితి,

నిషిద్ధలిజ్గం శేషార్థం త్వన్తాథాది న పూర్వ భాక్.