ఈ పుట ఆమోదించబడ్డది

రామరాయ లనుజద్వయముతోడను, తదితరసైన్యములతోడను వారిని వెంటాడించి పోరి యోడింప వారువిధేయులై యణకువను జూపిరనికూడ నీక్రిందివిధమున వర్ణించియున్నాడు.

      "మ. హరిశౌర్యుం డగురామభూవిభుని తీవ్రాటోపవద్వాహినీ
           శరవేగంబున నాత్మమూలబలము ల్జారం దలాడంబరం
           బరుగం గొమ్మలువోవ లావరినిజమాదు ల్వజీరుల్భజిం
           తురు నమ్రత్వము గానలో ముసలిమానుల్గా వితర్కింపగన్."

       "గీ. అనుచు శిరములు దాల్తు రెవ్వనిసమగ్ర
           సైన్యధుతధూళి చకితులై చనునపాద
           కుతుబశాహినిజామాదికుతలపతు ల
           తండు నృపమాత్రుడే రామ ధరణివిభుడు."

తన 'స్వరమేళకళానిధి' యందు రామయామాత్యతోడరమల్లుగూడ రామరాయలు భీమార్జునలం బోలినసోదరద్వితయము యొక్కసాహాయ్యముతో సర్వపారశీకులను (మహమ్మదుమతస్థులయినవారిని) జయించి భూమియందు గొప్ప కీర్తిని ప్రతిస్టాపించెనని చెప్పియున్నాడు.[1]

ఇట్లే యందుగులవెంకయ్య యనునాతడు గూడ తాను రచించి యారవీటికోదండరామరాజున కంకితము గావించిన

  1. విజిత్యసర్వాన పిపారశీకాన్ రణేషుతత్కీర్తిపటచ్చరాణిఆధూయ భూయోహరితోవధూటీ: విశోభయ త్యేషయశోదుకూలై: (స్వరమేళకళానిధి)