ఈ పుట ఆమోదించబడ్డది

సాదింపు మనిసామ్రాజ్యములోనిప్రజ లనుదినము నిష్టదేవతలను బ్రార్థించుచుండిరి. సామ్రాజ్యములోని ప్రభుపుంగవులలో నధికసంఖ్యాకులదృష్టులు రాజబంధువులలో బ్రముఖుడై యుధిష్ఠిరునకు భీమార్జునులలవలె చేదోడు వాదోడుగా నుండి బక్తితాత్పర్యములతో తిరుమలరాయవేంకటాద్రులనుసోదర ద్వితయముచే సేవింపబడు చున్నయళియరామరాయలపై ప్రసరింపసాగినవి. ఈద్రోహి బాఱిపడక విజయనగరరాజధాని నుండి తప్పించుకొనిపోయిననాటనుండి పిఱికిబంటులై మౌనముతో నొకచోట నొదిగి కూరుచుండినవారుకారు.

అళియరామరాయల దండయాత్ర

అళియరామరాయ లట్లుసోదరు లయినతిరుమలరాయ వేంకటాద్రులతో విద్యానగరమును విడిచిపెట్టిపోయి మున్ముందుగా గుత్తి, పెనుగొండ, గండికోట, యాదవాని, కందనోలు దుర్గముల కధిపతులయినవారిని స్వాధీనపఱచుకొని యాయా సీమలసైన్యముల నసంఖ్యముగా సమకూర్చుకొని అచ్యుతదేవరాయల తమ్ముడును, సలకముతిమ్మయచే జంపబడినవాడును నగురంగరాయలకొడుకు సదాసివదేవరాయ లేగిరిదుర్గముననో దాగొని యున్నవా డనితెలిసికొని తొలుతవానినిరప్పించుకొని యాతనికభయప్రదాన మొసంగి, తమకులదైవమైనతిరుమల వేంకటేశ్వరులసన్నిధానమున మఱదియు, బాలుడు నగునాతని విజయనగరసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తునిగావించి యట