ఈ పుట ఆమోదించబడ్డది

సమయమున సార్వభౌముని తల్లియగు వరదాంబికా దేవియు గూడ సోదరుని దుర్నయమును జూచి భరింప జాలక తన కుమారుని, వానిసామ్రాజ్యమును గాపాడినయెడల విశేషముగా ధనమునొసంగుచున్నా ననివిజాపుర సుల్తా నగుఇబ్రహీమ్ ఆదిల్‌షాహాకు రాయభార మంపెననియు, ఆరాయబారమును మన్నించి యాతడు తనసైన్యముతో విద్యానగరమునకు వచ్చుచుండుటను విని సలకముతిమ్మయ విశేషధనముతో రాయబారులను నాతనికడకు బంపి వెనుకకు మరలించెననియు 'కోరియా' యనునొక విదేశీయుడు వ్రాసియున్నాడు. రాణి దిక్కులేనిపక్షివలె వానిచేతిలో జిక్కెను. అంత నీద్రోహి తనపదవిని బలపఱచుకొనుటకును, తనమేనల్లునిపక్షమును బూని సామ్రాజ్యములోపలగాని వెల్పలగాని తనతో నెవ్వరును యుద్ధముచేయ సాహసింప కుండుటకును, తనమేనల్లుడును సార్వభౌముడు నగుచిన్నవేంకటాద్రిని వాని పినతండ్రులిర్వురను వానిదాయాదితోసహా నల్వురను సంహరించెనని 'కోరియా' యనునాతడు వ్రాసియున్నాడు.

అచ్యుత దేవరాయల తమ్ముడు రంగరాయలు వీనిచేతంబడి మ్రగ్గెనుగాని వానికుమారుడు సదాశివరాయలు మాత్ర మీద్రోహి పాలంబడి మడియకుండుట వానియదృష్టమని భావింపవలయును. రాణి వరదాంబికాదేవిగతి యేమయ్యెనో యిటుపై యెంతమాత్రము వినంబడదయ్యెను. ఆహా! రాజ్యకాంక్ష యీదురాత్ముని యెంతటిదౌష్ట్యమునకు బురి