ఈ పుట ఆమోదించబడ్డది

నాకాలమున గూడ 'అళియరామరాయ' లెట్టిసితి యందుండియెట్లు గౌరవింపబడియెనో సత్యచరిత్రము తేటపడకున్నది. కాని 'నన్నీజు' ధనాశాపీడుతు లయినయూధులగు నీ సోదర ద్వయముచేతులలో బరిపాలనాభారము నంతయునుంచి వారేమిచేయుమన్న నదిచేయుచుండె ననియచ్యుత దేవరాయలను నిందించి యున్నవాడు. ఈవాక్యములను విశ్వసించి న్యూయలుగారు తమవిస్మృతసామ్రాజ్యమునందు నన్నీజు వ్రాసినట్లేవ్రాసి యున్నారు. వీనినివిశ్వసించి హిరానుఫాదిరి పైనుడివిన 'క్వెరోజు' వాక్యములను దామువ్రాసిన చరిత్రమునందుదాహరించి యున్నారుగాని యచ్యుత రాయాభ్యుదయమునగాని వరదాంబికా పరిణయమునగాని మరియేగ్రంథమువలన గాని తదితరము లయిన శాసనాదులలో గాని, అచ్యుత దేవరాయల దక్షిణదేశ దండయాత్రల సందర్భమున గాని యీసోదరుల నామములు గాని వాగు చేసిన ఘనకార్యములు గాని వినరావు. సామ్రాజ్యమున వీరికెట్టిపలుకుబడిగలదో యేతద్విషయము గూడ నెందును గానరాదు. అచ్యుతదేవరాయలను నిందించుసందర్భమున 'నన్నీజు' వ్రాసిన వాక్యములలో నుదాహరింపబడినసోదరు లిర్వురును వీరుగారనియును అచ్యుతదేవరాయల భార్యయగు వరదాంబికతోబుట్టువు లగు సలకము పెదతిమ్మరాజు, చినతిమ్మరాజు నై యుండవలయు ననినాయభిప్రాయము. ఎందుకన, అచ్యుతదేవరాయలు మరణించునపుడు పులికాటి (తూర్పు