ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరప్రాంతముననో తరువాతనో జరిగియుండును. ఇతడు వీరనృసింహ రాయలవారిచే "స్వామిద్రోహరగండ నూపురమును" బహుమానము గాంచి నట్లుగ నీక్రిందిపద్యము వలన దెలియుచున్నది.

    "శా. శ్రీమద్వీరనృసింహరాయనృపతిశ్రేయోదయాసాధిత
        స్వామిద్రోహరగండనూపురవిరాజద్రామరాట్తిమ్మభూ
        పామిత్యర్జితపుణ్య సత్ఫలసమస్తాశాంతవిశ్రాంతని
        స్సీమోర్యిప్రతిపాదనప్రతయశా శీతాంశువంశోనిధీ."


ఆదవేనికొండరాజు

పైపద్యమున వీరనృసింహరాయనిపట్ల ద్రోహబుద్ధితో బ్రవర్తించినవా డెవ్వడో చెప్పకపోయినను, ద్విపదబాల భాగవతమున:-

      "విక్రమంబున నాదవేనిదుర్గంబు
       విక్రాంతు లెన్న వేవేగ సాధించి
       సిరులతో వీరనృసింహరాయలకు
       బరుషాత్ము దుర్గాధిపతి నొప్పగించి
       గరిమ స్వామిద్రోహగండపెండార
       మరిభీకరముగ రాయ లొసంగ నొందె
       లాలితకీర్తి విలాసుండు పద్య
       బాలభాగవతప్రబంధనాయకుండు."