ఈ పుట ఆమోదించబడ్డది

కును తరువాతనుగూడ విజయనగరసామ్రాజ్యాధిపులపక్షమున నుండి పెక్కుయుద్ధములలో బాల్గొని యున్నవాడు. ఇతని చరిత్రమునం దొకవింతమాహాత్మ్యము వర్ణింప బడినది. ద్విపదబాలభాగవతమున:-

      "అందగ్రజుండైన యాతిమ్మనృపతి
       యిందువంశవతంసు డితడస వెలసె
       రాజశిరోమణి రాజులరాజు
       రాజచంద్రుడు రామరాజు తిమ్మయ్య
       అపదృష్టి యగునొక్కయాభీరునకును
       నిపుణుండు వేంకటనిలయుండు చక్రి
       యొకకంటిచూపు తానొసగి స్వప్నమున
       బ్రకటుడై తిమ్మభూపాలు మన్నించి
       ఓకృతకృత్య నీ కుర్వీశు లెనయె?
       నీ కహోబలపుణ్యనిధి మోక్షమిత్తు
       గరుణ గోపాలునికడమచూ పిమ్ము,
       నరనాథయనుచు నానతి యిచ్చుటయును
       గొలువులో నగ్గోపకునకునుచూ పొసంగె."

       అని యున్నది. పద్యబాలభాగవతమునగూడ,

      "వేంకటేశ్వరు నాజ్ఞ విగతదృష్టికి దృష్టి
       దయమీఱ నిచ్చె నేధర్మమూర్తి"

అనియు గలదు. కన్నులులేని యొకగోపకునకు వేంకటేశ్వరుడుకరుణించి యొకకన్నుమాత్రము నిచ్చె ననియు,