ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.


అళియరామరాయల జీవిత గ్రంథమును వ్రాయుటకు నన్నుఁ బురికొల్పినది "The Aravidu dynasty of Vijianagar" అని వ్రాయబడిన గ్రంథమే. ఈ గ్రంథమును బొంబయినగరములోని సెంటుక్షేవియరు కాలేజీలో చరిత్రోపాధ్యాయులుగానున్న The Rev. Henry Heras, S.J.M.A. గారాంగ్లభాషలో రచించిరి. వీరు పోర్చుగల్ దేశస్థులు. వీరు విజయనగర సామ్రాజ్యమును బరిపాలించిన యీయారవీటి వంశచరిత్రమును విజయనగర సామ్రాజ్యమునకు బ్రతిస్పర్థులుగ నుండెడు దక్కను సుల్తానుల దర్బారులలో నుండెడు విమతస్థులగు చరిత్రకారుల వ్రాతలను, వారలకు సమకాలికులై యాకాలమున వర్తకమునకై యీ దేశమునకు నేతెంచిన పోర్చుగీసు లేఖకుల వ్రాతలను, క్రైస్తవమత గురువుల వ్రాతలను నెక్కువగా నాధారపఱచుకొని రచించి యున్నారు. ఇందునకై యాంధ్రులెల్లరును గృతజ్ఞఉలై యుండవలసినదే కాని వీరు తమ చరిత్రమునందు " అళియరామరాయల " శీలపరిశీలనమున సమకాలికులగు హిందూ గ్రంథకర్తల యొక్కయు, కవులయొక్కయు వ్రాతలయందు విశ్వాసముంచక సమకాలికులుగాని తమ దేశస్థులు తమభాషలో వ్రాసిన లేఖనముల యందును, విజయనగర సామ్రాజ్యము నెడస్పర్థగలట్టియు, రామరాయల నసూయతో జూచునట్టియు విమతస్థులయిన చరిత్రకారుల లేఖనముల యందును నిర్హేతుకముగా విశ్వాసముంచి పెక్కు దురభిప్రాయములను వెలువరించియున్నారు. అళియరామరాయలజేయ పరాక్రమంబునఁ గృష్ణదేవరాయలను, అమేయబుద్ధి