ఈ పుట ఆమోదించబడ్డది

కేశ్వరునిమంత్రి హరిహరరాజును, కోశాధ్యక్షుడగు బుక్కరాజు గూడ నుండె ననియు, డిల్లీచక్రవర్తి రాజ్యమును వశపఱచుకొని యాప్రదేశమునకు 'మలిక్‌నాయబ్‌' అనువాని నధికారినిగా నేర్పఱచి చెఱపట్టి యుంచినయార్గురిని వెంట దీసికొని డిల్లీనగరమునకు వెడలిపోయె ననియు, ఎప్పుడు చక్రవర్తి వానిసైన్యములతో దమదేశమును విడిచిపెట్టి వెడలిపోయెనో యానాటనుండియు 'మలిక్‌నాయబు' నకు ప్రజలు వశ్యులు గాక దిక్కరించి పోరాడుచున్నందున వారిశౌర్యోత్సాహములను స్వాతంత్రప్రీతిని మెచ్చుకొని యచట రాజ్యముచేయుట తనకుసాధ్యము కాదని తలంచి చక్రవర్తికి దేశస్థితి నంతయు దెలియ జేయగా నాత డట్లేయూహించి తనకడ బందెలో నున్న హరిహరునకు రాజ్యము నొసంగి బుక్కరాజును వానికి మంత్రిగా నియమించి తమకుసామంతులుగనుండు నట్లొప్పించుకొని వారలను కారాగారమునుండి విముక్తులను గావించి వారిదేశమునకు బంపినతరువాత 'మలిక్‌నాయబు' ను దనకడకు రప్పించుకొనె' ననియు మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసి యున్నారు. ఇవి సత్యములు కావు. ఈదండయాత్రలో మహమ్మదుబీన్‌తుఘ్‌లఖ్ గొప్పదెబ్బ తిన్నాడు. ఆదెబ్బతీసినవాడు సోమదేవరాజు. ఈదెబ్బతో మహమ్మదు బీన్‌తుఘ్‌లఖ్ దక్షిణహిందూదేశ దండయాత్రలు సాగించుట నిలిచి పోయినది. చక్రవర్తియంతటివాని నోడించి కదనరంగమున జెఱపట్టుటయు, అతడు 'మహాప్రభూ! నాకుమారునకు