ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిల్‌షా వారికి గొప్పవిందు గావించెను. అచటనుండివారు 1564 సంవత్సరము డిసెంబరు 26 తేదీని దక్షిణముగా నడచుటకు బ్రారంభించిరి. వీరందఱును తల్లికోటసమీపమునకు జేరుకొనిరి. వీరిలో గోల్కొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా యొక్కమంత్రియు, సైన్యాధ్యక్షుడునగు 'కమల్‌ఉద్దీన్ - హుస్సేను' ఆతనికి 'ముస్తఫాఖా' ననుబిరుదము గలదు. ఇతడు రాజకార్య తంత్రజ్ఞుడు మాత్రమెగాక మహాయోధుడుగూడ నైయున్నవాడు. మహాసమర్ధుడు. అహమ్మదునగరసైన్యములకు మౌలానాఇనాయతుల్లా సైన్యాధ్యక్షుడు. విజాపుర సైన్యములకు 'కిన్వర్‌ఖాన్‌' సైన్యాధ్యక్షుడు. గోల్కొండసైన్యములతో 'రిఫత్‌ఖాన్‌' అనుగొప్పసేనాని యొక డుండెను. వీరిచే సైన్యములు పాలింపబడుచుండెను. మఱియు విజాపురసైన్యములతో నాఱువేల మరాటా యాశ్వికసైనికులు గలరు. ఈసైన్యమునకు ముఖ్యనాయకులు 'యశ్వంతరావు, భోజమల్లనాయక్, దేవనాయక్, బస్వంతరావు, విశ్వేశ్వరరావు, కాశీరావు' అనువారలని తెలియుచున్నది. ఈదక్కనుసుల్తానులసైన్యములు మహారాష్ట్ర కర్ణాటాంధ్రదేశములను బాలించువారుగనుక వీరిసైన్యములో గేవలము మహమ్మదీయులేగాక హిందువులుగూడ నుండిరని మనము విశ్వసింపవచ్చును. పోర్చుగీసుగ్రంథకర్తలు తురక సైన్యములో నేబదివేలయాశ్వికులును, మూడువేలపదాతు