ఈ పుట ఆమోదించబడ్డది

వేసె నట. అట్లిచ్చునపు డొకవెండిగరిటె కానుపింపలే దట. దానిని వెదకించి తెప్పించి దానియజమాని కిప్పించువఱకు నాతడు కదలలేదట ! రామరాయలు పట్టణము విడిచిపోయి విజయనగరము జేరినవెనుక వారుచేసినసేవకు సంతోషించి రాయ లాపోర్చుగీసుగృహస్థుల నైదుగురును వారి స్వస్థలమునకు బోవుట కనుజ్ఞ నొసంగెనట !

ఈపైకథ నిర్వురు పోర్చుగీసు లేఖకులు వ్రాసినారని నుదాహరించుచు హీరాసుఫాదిరి "రామరాయల కుండుద్రవ్యము నెడగలదురాశవలన నిట్టిది సంభవించెనేకాని విజయనగరమునకును పోర్చుగీసువారికిని తరువాతిసంవత్సరములు స్నేహముతోనే గడుప బడిన" వని వ్రాయుచున్నాడు.

కాని, తిరుపతిదేవస్థానమును కొల్లగొనుటకై పోర్చుగీసువారు ప్రయత్నించియు భగ్నమనోరథులై వారు దీనిని విడిచిమలయాళ దేశమునందలి దేవాలయములను దోచుకొనిరను నప్రఖ్యాతినికమ్ముదలచేయుటకై యాపోర్చుగీసు లేఖకులే దీని నెవ్వరోకల్పించి యుందురు. ఎక్కడనోయుత్తరదేశమున నహమ్మదునగర గోల్కొండ సుల్తానులతో బోరాడు రామరాయ లైదులక్షల సైన్యముతో దూర్పుతీరమునకు దండెత్తివచ్చుట యెట్లు సంభవించును? రామరాయలు దురాశాపాతకు డనిలోకు లనుకొనుటకై పోర్చుగీసువారు కల్పించిన కల్పనాకథగాని యిదిసత్యమైన చరిత్రాంశముగా దని మనము విశ్వసింపవచ్చును.