ఈ పుట ఆమోదించబడ్డది

లోనిప్రజలను భయకంపితులను గావించెను. ఉణ్ణికేరళవర్మ యీభయంకర మైనవార్తను విని కొంతసైన్యమును సమకూర్చెను గాని యాసైన్యము తెలుగుసైన్యములముందు దివిటీ ముందు దీపమువలె నుండెను. విజయనగరసైన్యములు యుద్ధముల యందాఱితేఱినవిగ నుండెను. తిరువడిరాజ్యాధిపతి విజయనగర సైన్యములను జయించుట కష్టసాధ్య మనియెంచి "ప్రాన్సిస్‌గ్షేవియర్‌" అను ఫాదిరిద్వారా పోర్చుగీసువారితో నొడంబడిక చేసికొని వారిసాహాయ్యమును బడసి విజయనగర సామ్రాజ్యాధి పత్యమును ధిక్కరింప బ్రయత్నించెను. ఫాదిరి ప్రాన్సిస్‌గ్షేవియరును రప్పించుకొని యాతని సాహాయ్యమునకై వేడుకొనగా నాత డిట్లు ప్రత్యుత్తర మిచ్చె నట !

"నేను మతప్రచారకుడనేగాని యోధుడనుగాను. నేనుచేయు సాహాయ్య మంతయు నీకువిజయము కలుగుటకై ప్రార్ధనలు సేయుటతప్ప మఱియొండు లేదు."

అయిన నత డిట్లుతనవాగ్దత్త మీక్రింది విధముగా నెఱవేర్చు కొనియె నట !

అట్లు విజయప్రదము లగుశంఖా రావములతోను, జయభేరి ధ్వనులతోను విజయనగర సైన్యములు 'కొట్టా' లనుగ్రామమును సమీపించునప్పటికి మున్ముందుగ నడచుచున్న ముంగటిసేన యాకస్మికముగా నిలిచిపోవుట చూచి వెనుకనున్నవారు సైనికుల 'నడుపుం' డని యాజ్ఞాపించినను