ఈ పుట ఆమోదించబడ్డది

తీసికొని రావలసిన దనియుత్తరువుచేసె నట ! వారు ప్రభుత్వ సైన్యములను గెలువంజాలక యాదవానిదుర్గములో దాగొని యుండ నాఱుమాసముల వఱకు ముట్టడించి వారిని విడువక పోగా నాహారపదార్ధములు చిక్కనందున వారుక్షమింపవలసినదని విజయనగరమునకు విజ్ఞాపనలను బంపుకొని రట ! వారలను క్షమించి రామరాయలు తనసైన్యములను రప్పించుకొని కాబూల్‌ఖానునకు బహుమానము నొసంగిపంపెనట. అతడు గోలకొండ జేరిసుల్తానువలన 'ఐన్ - ఉల్ - ముల్కు' అనుబిరుదమును గాంచె నట !"

ఈపైవిధ మంతయు నాయనామధేయచరిత్రకారుడు దెలిపినది. [1] ఈయనామధేయ చరిత్రకారునకు రామరాయల తమ్ములపేరు లయినను సరిగా దెలియ కుండెను. తిరుమలరాజు, వేంకటాద్రివారిపేరు లయియుండగా వానిందెలిసి కొనంజాలక తిమ్మరాజు, గోవిందరాజు నని వక్కాణించినాడు. తిరుమలరాజును తిమ్మరాజని వ్యవహరింపగూడదా యని యందురేని గోవిందారా జనుపేరుగలవా రారవీటివంశమువారిలోనే గానరారే ? విజయనగరసామ్రాజ్యమునందు లక్షలకొలదిసైన్యము లుండగా వీనితోజయింపలేక రామరాయ లంతటివాడు గోల్కొందవారిసహాయమును గోరవలసివచ్చినదా ? వారు పంపినది యాఱువేల సైనికులనా ? ఈయాఱువేల సైనికులు వచ్చినతోడనే శత్రువులు వీరిని జయించుట సాధ్యముకా దని

  1. The Aravidu Dynasty of vijianagar p. 33