ఈ పుట ఆమోదించబడ్డది

మయినదిగావున విశ్వాసపాత్రము కాదనిత్రోసిపుచ్చినా రట ! కాని మనమదుసత్యముకలదని యొప్పుకొనక తప్పదని హీరాసుఫాదిరి నొక్కి వక్కాణించుచున్నాడు.

"అహమ్మదునగరసుల్తానుతో బోరాడుచున్న విజాపురసుల్తానుకు దోడ్పడుటకై రామరాయలు రాజధానీ నగరమును విడిచిపోయినపుడు, ఆదవానిప్రభుత్వమున నియోగింపబడిన తిమ్మరాజు, గోవిందరాజు ననుసోదరు లిర్వురును నాతడు లేకుండుట సందుచేసికొని యాదవానియాధిపత్యము నాక్రమించుటయె గాక" "కొంతసైన్యమును సమకూర్చుకొని తమయధికారమునకు ననేకమండలములవారిని లోబడునట్లుచేసి వశ్యులను గావించుకొని రట. రామరాయలు విజయనగరమునకు దిరిగివచ్చినతోడనే తనసోదరులకు జాబులుపంపెనట ! కాని వారు తమబలమునే యాధారపఱచుకొని యాతని జాబుల నలక్ష్యభావముతో నుపేక్షించి రట ! వారల జయించుటసాధ్యము గాక రామరాయలు గోల్కొండవారి సాహాయ్య మపేక్షింప బురికొల్ప బడె నట ! అంత రామరాయలు గోల్కొండకు సహాయముకొఱకు రాయబారులను బంపగా ఇబ్రహీమ్‌కుతుబ్షా యారువేలపదాతి సైన్యముతో కాబూల్ ఖానుని పంపె నట ! ఈసైన్యము విజయనగరముచేరినతోడనే రామరాయలు సిద్ధిరాజు తిమ్మరాజును, నూరుఖానుని, బిజ్లీఖానుని వారిసైన్యములతో కాబూల్‌ఖానుని సైన్యములను గలిసికొని పితూరీదార్లపై దండయాత్రసాగించి జయించి పట్టి