ఈ పుట ఆమోదించబడ్డది

అపుడు ముస్తఫాఖాను "మహాప్రభూ ! నామరణము నీసామ్రాజ్యమునకు క్షేమదాయక మని దేవరవారు తలంతురేని యిదిగో నేను కుట్రదారులకు లోబడుటకు సిద్ధముగా నున్నా" నని సుల్తానుకు నివేదించుకొనియె నట. కాని సుల్తాను నాయకులప్రార్థనము నంగీకరింపకుండె నట. మఱికొన్ని దినములకు బలాత్కారముగా నాయకు లెల్లరులోపడవలసివచ్చెనట. అప్పుడు సూర్యారావు మొదలగునాయకులెల్లరు సంహరింపబడి రట. ఇయ్యవి ఫెరిస్తావ్రాసినవ్రాతలు. ఇందెంత సత్యమున్నదో భావిపరిశోధనల మూలమున దెలిసికొనవలసియుండును.