ఈ పుట ఆమోదించబడ్డది

వీనిపూర్వులు కళ్యాణపురమును విడిచిపెట్టవలసివచ్చినను 'కళ్యాణపురవరాధీశ్వర' అనిబిరుదమును మాత్రము విడిచిపెట్టి యుండలేదు. దక్షిణహిందూదేశమును బరిపాలించిన రాజవంశములలోని రాజులు తమపూర్వులు గడించినబిరుదములను విడువక వంశపారంపర్యముగా జెప్పుకొనుచు వచ్చుచుండుటచే నాయావంశసంప్రదాయ చరిత్రములకు గొంతవఱకు నైనదోడ్పడుట కవకాశ మిచ్చుచున్నవి.

వీరహొమ్మాళిరాయడు

ఈవంశమునకు మూలపురుషు డయినవీరహొమ్మాళి రాయడనునాతడు పశ్చిమచాళుక్య సామ్రాజ్యభాను డస్తమించుకాలమున నొకసామంతమాండలికుడుగాను సైన్యాధ్యక్షుడుగాను నుండినవాడయి యుండవచ్చు నని యూహించుటలో బ్రమాద మేమియును గానరాదు. పండ్రెండవశతాబ్ది తుదను హొయిసలరాజయిన వీరబల్లాలుడు గాంగవాడి, నోలంబవాడి, బవవాసిరాజ్యముల నాక్రమించుకొని పరాక్రమవంతుడై పరిపాలనముసేయుచు కళ్యాణపురముపై దండెత్తివచ్చి చాళుక్యనృపతి యగునాల్గవసోమేశ్వరుని సైన్యాధ్యక్షు డగు బొమ్మరాజు నెదుర్కొని యాతని గదనరంగమున నోడించి బిజ్జలునియొద్దనుండి గైకొన్నరాజ్యము నాక్రమించుకొనియెను. కర్ణాటభాషలో వ. బ. అనునక్షరములు 'హా' అనునక్షరముగ మాఱి యుచ్చరింపబడుట సాంప్రదాయసిద్ధమయిన