ఈ పుట ఆమోదించబడ్డది

మనస్సులోనుంచుకొని వానిపై పగవహించి యుండెనని ఫెరిస్తా వ్రాసియుండెను. ఇదివట్టియబద్ధమైనది. వానచినుకుల సంఖ్య కంటె నధికసంఖ్యకల సైనికులతో వారిరువురును నిజాముషారాజ్యముపై దాడివెడలి రనియు, వానిరాజ్యమునంతయునాశనము చేయగా దేశములోనిప్రజలు పరస్థలములకు వలసపోవుటచే బెక్కుమైళ్లు బీడుపడిపోయె ననియు, హుస్సేనునిజాముషా వారల నెదుర్కొనలేక అహమ్మదు నగరమును విడిచి పైఠనునకు బాఱిపోయె ననియు, తరువాత కొంతకాలమునకు, కళ్యాణిదుర్గమును ఆలీఆదిల్‌షాకు సమర్పించుకొని సంధిగావించుకొనె ననియు, 'బురహాన్ - ఈ - మాసీర్‌' అను గ్రంథమున వక్కాణింపబడి యుండెను. మఱియు

           "పదిలుడై రాచూరుముదిగల్లుగప్పంబు
            సేయ గాంచ సపాదు సీమనిలిపె"

నని, రాచూరు, ముదిగల్లుదుర్గములు గప్పముగాగైకొని విజాపురసుల్తానును మరల నిజరాజ్యమున నిలిపె నని భట్టుమూర్తికూడ తన 'నరసభూపాలీయ' మనుగ్రంథమున స్పష్టముగనుడివి యున్నాడు.

మఱియొక యుద్ధము

శత్రుసైన్యము లహమ్మదునగరమును విడిచివెళ్లినతోడనే హుస్సేనునిజాముషా ఇబ్రహీమ్‌కుతుబ్షాతో సంధిగావించుకొని తనశత్రువుని కర్పించినకళ్యాణిదుర్గమును స్వాధీనపఱచు