ఈ పుట ఆమోదించబడ్డది

మని వ్రాయుచున్నాడు. ఆకాలమున విజయనగరమునకు నట్టి దేశనష్టము కలిగినసంగతి వినరాదని యీవిషయములకు దరువాత రామరాయల హమ్మదునగరసుల్తా నగుబురహాన్ నిజాముషాతో యుద్ధమునకు దలపడియున్నవాడు గనుక ఫెరిస్తా వ్రాసిన దతిశయోక్తి యనిమాత్ర మొప్పుకొనుచున్నాడు.

అసలు హీరాసుయెత్తిన యెత్తుగడయె సక్రమమైనది గాదు. విజాపురసుల్తాను సంధిచేసికొన్న తరువాత బురహాన్ నిజాముషాతో జేరి బీదరు విద్యానగరములపై యాసంవత్సరమె మరల దండయాత్ర సాగించినా డనుటసత్యవిరుద్ధము. ఫెరిస్తా వ్రాసిన వాక్యముల దుర్ర్భమలో దగుల్కొని చరిత్రబద్ధములు కానివిషయములకు బ్రాముఖ్యత నొసంగి తనతో యుద్ధముచేయ ఇబ్రహీమ్ ఆదిల్‌షాను బ్రేరేపించినవా డని యీసుగలిగి బురహాన్ నిజాముషాపై రామరాయలు దండెత్తి పోయినవా డనిహీరాసువ్రాసినది సత్యముకాదు. సలకముతిమ్మయ సంభవింప జేసిన విప్లవకాలమున నాతనికి దోడ్పడవచ్చినవా రనితక్కినసుల్తానులపై దండయాత్ర సాగించి నట్లే రామరాయలీతనిపై గూడ దండయాత్రసాగించినవా డుగాని మఱియన్యకారణముచేత గాదనిభట్టుమూర్త్యాదులు వ్రాసిన వ్రాతలవల్లనే తెలియుచున్నది. అళియరామరాయలును వాని తమ్ముడు తిరుమల దేవరాయలును, జమ్షీదు కుతుబ్‌షాను బురహాన్‌నిజాముషాను వెంబడించిపోయి యుండిరని యింతకు బూర్వము దెలిపియున్నాను. అళియరామరాయలు జమ్షీదు