పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

86

అక్కన్న మాదన్నల చరిత్ర

ఈయైశ్వర్యము అక్కరలేదు. సన్న్యాసము. సన్న్యాసము. మక్కాకు పోవలసినదే. కాశీరామేశ్వరాలలో పకీరుగా తిరుగుటమేలు. పొండు, తెరచి వేయుఁడు, ఖిల్లా దర్వాజాలంతయు తెరచివేయుఁడు,”

తానాషా ఈమాటనేచెప్పి పనవిపనవి యేడ్చుచుండెను. ఆసందర్భమున సుల్తానుతో మాటలాడ గలిగినవాఁ డెవఁడు? దర్వాజాలు తెఱచినయెడల నిఁకనేమున్నది. మొగలాయీలు ప్రవేశించి సర్వసంహారము చేయుదురు. మంత్రులను ఖూనీ చేయించినవారి యుద్దేశము అదికాదు. వారికి ఆ మంత్రులుపోయి వేఱుమంత్రులు రావలయుననియు అట్లుచేసిన ఔరంగజేబు సంతోషించుననియు, తమ పగతీరుననియు. అబ్దుల్‌రజాక్ లారీ చాలజాలితో సుల్తానును చూచుచుండెను. అతఁడు మాత్ర మేమిచేయఁగలఁడు. మొగలాయీవారు భేదడండోపాయములలో చాల సమర్థులు; ఎంతద్రోహమునకైనను వెనుదీయనివారు. వారితో తానాషాయొక్క అంతఃపురమందలి స్త్రీ వర్గము చేరినది. వారికి రాజనీతియేమి తెలియును. వారెఱిఁగినదంతయు కడుపుమంట తీర్చుకొనుటయే. పూర్వద్వేషములను మనసున నుంచుకొనియు కొందఱు ద్రోహులతో చేరియు అక్కన్న మాదన్నలను చంపించి హిందువులను కడతేర్చిన ఔరంగజేబు సంతోషించునని తలంచిరి. మొగలాయీపక్షపాత మవలంబించుటకు వారికిఁగలకారణమీమాత్రమే. గొప్పసామ్రాజ్యమును ఈ మహామంత్రులు కాపాడుచుండి