పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౩ - కుట్రలు, కుయుక్తులు

67

పోయియుండినందున శత్రువును వెన్నంటుటకు సాధ్యపడనందున ఫలవంతము కాఁజాలకుండెను. మీఁదుమిక్కిలి మొగలాయీ దండనాయకులలో ఐకమత్యము లేకుండెను. రాజకుమారుఁడు చాల మృదుస్వభావుఁ డైనందున వీరిజగడములు పెరుగుచుండినవి. మొగలాయీసైనికులకు ధైర్యము పోసాగినది. తుదకు యుద్ధము నిలిపి విశ్రాంతి నందసాగిరి. గోలకొండ సైనికులును చెంతనేయుండి అప్పుడప్పుడు రాత్రులు మొగలాయీస్కంధావారములోనికి అగ్నిబాణములను ప్రయోగించుచుండిరి.

ఇట్లుండఁగా పాదుషా తనకుమారుని అదలించుచు ఒక రాయబారిని పంపెను. అంత, మరల యుద్ధ మారంభమాయెను. ఒకదినము సూర్యాస్తమయమునకు షేక్‌మిౝహాజ్ రూస్తము రావులకు గాయములు తగిలినవి. వెంటనే గోలకొండసైన్యము వెనుదిరిగెను. ఇప్పుడు ఇరువాగులును హైదరాబాదును సమీపించినవి, మఱునాటి యుదయము మొగలాయీవారు విచారణచేయఁగా గోలకొండసైన్యము హైదరాబాదునకు పాఱిపోయెనని తెలిసినది.




ప్రకరణము ౧౩ - కుట్రలు, కుయుక్తులు

ఆకస్మికముగా గోలకొండసైన్యము పాఱిపోవుటకు కారణము చాలగొప్పదై యుండవలయును. అత్తిమత్తరాయడు ఎట్లయినను అక్కన్న మాదన్నలను కడతేర్చునుపాయ మాలోచించుచుండెను. ఇట్లుండఁగా నాతనికి సందుచిక్కెను. షేక్