పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౨ - మొగలాయీలతో ఘర్షణ

63

దినము తాను అతనిని మర్యాదగా పంపినది చాలదని మరల నొకమారు ఆతనియింటి కేగెను. మరల క్షమాపణ ప్రార్థించెను. ఆదినము చాలపొరపాటు జరిగినదనియు, ఆపల్లకి ఎవరిదోయని అక్కన్న తలంచెననియు నానావిధముల చెప్పి ఆతని హృదయమును రంజింపఁజూచెను. తనకుతోఁచిన బహుమతుల నెన్నిటినో ఇచ్చెను. కాని వాని నాతఁడుగ్రహింపలేదు. తాను ఆవిషయమును అప్పుడే మఱచిపోయితి ననెను. ఆతఁడు నవ్వుచునేయుండెనుగాని అది తెచ్చికోలునవ్వు, వికారముగా నుండెను. ఆతనిహృదయమున క్రోధానలము ప్రజ్జ్వరిల్లుచుండెనేగాని ఆఱలేదు. “అక్కన్నగారు ఆవిధముగా ప్రవర్తించినందువలన వారికే మానభంగముగాని నాకేమికొదువ. వారిగౌరవము పోయినదిగాని నాకేమిపోయినది. దీనినిగుఱించి మీరేమియు అనుకొనవలదు.” అని ఈతీరుననే మాటలాడుచుండెను. మాదన్న ప్రయోజనములేదని తలంచి వెడలిపోయెను.




ప్రకరణము ౧౨ - మొగలాయీలతో ఘర్షణ

బిజాపురమునకు సాయము చేసినందులకు తానాషా మీఁదికి పాదుషా దండు పంపెనని ముందుప్రకరణమున గ్రహించితిమిగదా. క్రీ. శ. 1680 సం. జూౝనెల 28 తారీఖున తన కుమారుని షాఆలం అనువానిని గొప్పసైన్యముతో హైదరాబాదుమీఁదికి పంపెను. మార్గమున ‘ఇండి’ అను ప్రదేశమున