పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

50

అక్కన్న మాదన్నల చరిత్ర

వారిని ఎదుర్కొని సులువుగా ధ్వంసము చేసినది. అదేసందర్భమున మొగలాయీలబలము తగ్గినదని గ్రహించి దత్తాజీ యను మహారాష్ట్రసేనాపతి, గృహరక్షణకై శివాజిచే నిలుపఁబడినవాఁడు, కనరాపైకి దాడి వెడలి హుబ్బళిపట్టణమును కొల్లగొట్టెను.

గోలకొండనుండి బయలుదేరిన ఛత్రపతి, ఆంగ్లేయులు ఇటీవల కర్ణాటకమని పేర్కొన్న మదరాసురాజ్యమును ప్రవేశించెను. ఈప్రదేశమున దాదాఁపు నూఱుకోటలు గలవు. అందు చెంచి (జింజి) వేలూరులు ప్రధానములు. శివాజీ 1677–78 సంవత్సరములనడుము జయించిన భాగము సంవత్సరమునకు ఇరువదిలక్షలహొన్నుల యాదాయముగలదిగా నుండెను. ఈ దేశమును ఆతఁడు మూలమట్టముగ దోఁచుకొనెను. ఇట్లు దాహశాంతి యైనంతట ఆప్రదేశములలో తనసిబ్బందిని కాపుంచి ఆతఁడు మైసూరు, కొప్ప, గదగు, ధార్వారు బెలగాములను జయించెను.

ఇప్పుడు శివాజీ గోలకొండవారికి కృతజ్ఞత తెలుపుచు ఒప్పందమును నెఱవేర్పవలసియుండెను. కాని ఆతఁడు ఆప్రకారము చేయలేదు. మాదన్నకును తానాషాకును ఆశాభంగ మాయెను. గొప్పవారికి ఎట్టివారికైనను ఒకలోటుండును; అది రాజనీతి కానిండు లోకనీతికానిండు. శివాజీ తనతోడిహిందువునకే మాటతప్పెను. తనప్రక్కనుండు దక్కనురాజ్యములలో నొకదానినే మోసముచేసెను. ఇంతవఱకు మాదన్న నిర్మించిన