పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

48

అక్కన్న మాదన్నల చరిత్ర

ను, పూర్వము తనతండ్రి పాలించుచుండిన ప్రదేశములను తానుంచుకొనునట్లును వాగ్దాన మొనర్చెను. మొగలాయీలవలన గోలకొండకు ఎట్టి యుపద్రవమును తాను రానీయనని శివాజి తానాషా ఎదుట ప్రమాణము చేసెను. తానాషాయును పై యుద్ధద్రవ్యముగాక రక్షణవిధానమునకుగాను సంవత్సరమునకు శివాజికి లక్షహొన్ను లిచ్చునట్లును మహారాష్ట్రుల రాయబారి నొకనిని తనయాస్థానమం దుంచుకొనుటకును ప్రమాణ పూర్వకముగా నొప్పుకొనెను.

శివాజి గోలకొండలో ఒకనెలదినము లుండెను. ఈనెల యంతయు ఊరిలో నుత్సవములు జరుగుచునేయుండినవి. శివాజికి తానాషా రెండుపర్యాయములు దర్శన మొసంగెను. వ్యవహారములనుగుఱించి మాదన్నయే మాటలాడుచుండెను. మరల దర్శన మిచ్చినప్పుడు మరల విస్తారము అనర్ఘ్యవస్తువిశేషములను తానాషా శివాజి కొసంగెను. తానాషా తనసౌధమున పైన కూర్చుండి ప్రక్కన శివాజిని కూర్చుండబెట్టుకొని ప్రజలకు దర్శనమిచ్చెను. తానాషాయొక్క మంత్రులు సేనాధిపతులుమొదలు సామాన్యసైనికులవఱకు అందఱును రాజవందన మొనర్చిరి. వెంటనే మహారాష్ట్రులును అట్లే తానాషాకును శివాజికిని వందన మాచరించిరి. తానాషా మహారాష్ట్ర సైన్యమునకును అధికారులకును సత్కార మొనర్చెను. ఈ వైభవమంతయు నైనవెనుక తానాషా శివాజి గుఱ్ఱముమెడలో వెలలేని వజ్రహారమునువైచి చాలమర్యాదచేసెను. హైదరా