పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౯ - శివాజీ తానాషాను దర్శించుట

47

చాలస్నేహ మేర్పడెను; పూర్వముండిన జంకు పోయెను. మొగలాయీసామ్రాజ్యమును గడగడలాడించుచున్న ఈవ్యక్తిని ప్రక్కనపెట్టుకొని కంటితో చూచినాఁడు. రాక్షసకృత్యము లొనర్చుచున్న మహారాష్ట్రవీరులను సైనికులను మాదన్నయొక్క మంత్రబలముచే ఇంట తెచ్చిపెట్టుకొని చూచినాఁడు. శివాజి చాల సరసుఁడనియు, సౌజన్యవంతుఁ డనియు, మహాసత్త్వుఁ డనియు, సైన్యశిక్షణలోను కార్యదీక్షయందును అసామాన్యుఁడనియు తలంచెను. ఆతనిస్నేహముండిన మొగలాయీల భయ మెంతమాత్రముండదని నమ్మకము కుదిరెను. మాదన్న రాజనీతిని కొనియాడెను. శివాజి ఏమికోరినను ఒసంగి ఆతనితో సంధిచేసికోవలసినదని మాదన్నను కోరెను. శివాజితో మాదన్న ఆలోచించి ఒక పథకమును కుదుర్చుకొనెను. దక్షిణదేశమును జయించుటకు శివాజికి దినమొకటింటికి మూఁడువేల హొన్నులు లేదా నాలుగునరలక్ష రూపాయలు నెలనెలకు ఇచ్చునట్లును, తమ సేనాధిపతి (సార్-ఇ. లష్కర్) యైన మీర్జా మహమ్మద్ అమీౝ అనునతనినాయకత్వమున వేయిగుఱ్ఱపు దండును నాలుగువేల కాల్బలమును పంపునట్లును ఒప్పకొనెను. కొంత తుపాకులు ఫిరంగులు వానికి కావలసిన మందుసామానులు, ఒప్పుకొన్న ద్రవ్యములో కొన్నినెలలది ముందుగానే ఖర్చులకు ఇచ్చుటకుకూడ ఒప్పుకొనెను. ఈసహాయమునకు బదులుగా శివాజి దక్షిణదేశమును జయించి తనతండ్రియైన షాజికి చెందనిభాగముల నన్నిఁటిని గోలకొండవారి కిచ్చునట్లు