పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

14

అక్కన్న మాదన్నల చరిత్ర

 సభలో నందఱు ఆశ్చర్యపడుచుండిరి. అక్కన్నమాదన్నలు సుల్తానునెదుట నిలువఁబడియే యుండిరి. తానాషా వెంటనే వారికి ‘వసారత్‌’ (అంతరంగిక కార్యదర్శి) అను నుద్యోగము నిచ్చి చాల గౌరవించెను. వారిని తెచ్చినందులకు ముజఫరుఖానునకును మర్యాదచేసెను.




ప్రకరణము ౩ - తానాషా పూర్వచరిత్ర

ఎవరీ యక్కన్న మాదన్నలు? వీరే సామ్రాజ్యాధినాయకులై కొంతకాలము గోలకొండను పరిపాలించిన సుప్రసిద్ధాంధ్రమంత్రులు అక్కన్నమాదన్నలు.[1] వరంగల్లుఫర్గణాలో పింగళి భానూజీపంతులు ఒకానొక అమీలుక్రింద సుంకాధికారి. ఈయన భార్య భాగ్యమ్మ. ఈదంపతుల భాగ్యముగా వారికి నలువురు కుమారులు జనించిరి. — అక్కన్న, మాదన్న, విశ్వనాథుఁడు, మృత్యంజయుఁడు నని. తండ్రియే కుమారులకు చదువు చెప్పెను. సకాలమున వివాహములంజేసి గృహస్థులనుగా నొనర్చెను. ఉత్సాహవంతులైన పెద్ద కుమారు లిరువురును ఒక శుభముహూర్తమున తండ్రియాజ్ఞనంది తమ పురోహితుని వెంటనిడుకొని రాజకీయోద్యోగములకై గోలకొండకు వచ్చి ముజఫరుఖానుకడ గుమాస్తాలుగా ప్రవేశించిరి.


  1. వీరు కొందఱు తలంచినట్లు మహారాష్ట్రులుకారు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులలో వీరవైష్ణవులైనవారు గోలకొండ వ్యాపారులు. వీరి బంధుపరంపర నేటికిని ఆంధ్రదేశములో నున్నారు.