పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/106

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౮ - బిజాపూరు ముట్టడి

93

గదా. నిన్ను నేను గొప్పపదవియం దుంచెదను. నీవేమియు భయపడవలదు. ధైర్యముగానుండుము.” అని అతనిని తన మనుమని ప్రక్క కూర్చుండఁబెట్టుకొని గొప్పదుస్తులు బహుమతిగానిచ్చి ఏడువేలరూప్యములు వెలగలిగిన రత్నములు తాపిన బాకును, పచ్చరాల పతకముతోడి ముత్యాలహారమును పదమూడువేల రూప్యములు వెలగలదానిని, రత్నములుతాపిన కత్తిని, వెలపొడవు గదను ఇచ్చి సమ్మానించి, ఖానను బిరుదముతో నొకమొగలాయీ సర్దారునిగా జేసి, సంవత్సరమునకు లక్షరూపాయలు భరణ మేర్పాటుచేసెను. ఈ మర్యాద యైనంతట సికందరునుకొనిపోయి ఆతనికై ఏర్పాటు చేయఁబడియున్న గుడారములో ప్రవేశపెట్టిరి. బిజాపూరు సర్దారులందఱును మొగలాయీ సర్దారులైరి. పాదుషాయాజ్ఞ పై మొగలాయీ అధికారులు బిజాపురమును స్వాధీనము చేసికొనిరి.

బిజాపూరు కళావిహీనమై పోయెను. స్వతంత్రరాజవంశము పోయినది; రాజప్రతినిధియొక్క పరిపాలనము ప్రారంభమైనది, ధనాదాయమంతయు ఢిల్లీకి పోసాగినది. సంగీతసాహిత్యాది లలితకళలను లాలించువారులేరు. ఆస్థానము అధ్వాన్నమాయెను. కవి పండిత గాయక చిత్రకార గణికాదుల మొగములు చూచువారు లేరు. రాచనగరిలో గోడలమీఁద నానా విధములైనచిత్రము లుండినవి. అవన్నియు ఖొరానుధర్మమునకు విరుద్ధములని, పరమాత్మతో మనుష్యుఁడు పోటీచేయ రా