ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్రౌపదీ దేవి చరిత్రము •

3



యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు నను మువ్వురు పుత్రులును మాద్రియందు నకు లుడు, సహదేవుడు నను కవల పిల్లలును పాండు రాజున కైదుగురు బిడ్డలుండిరి. పొండు రాజు మరణించెను. మాద్రి సహగమనము చేసెను. కుంతి బిడ్డలను పోషించుటకయి బ్రతికి యుండెను, పాండు రాజుఫుత్రుల నంచరిని పాండవులనియు దృశరాష్ట్రపుత్రులనుకౌరవులనియుం వాడుచుండురు. కౌరవులు బలము, పరాక్రమము, సాహసము మొదలగుగుణములు కలవారైనను నీతి, న్యాయము, ధర్మము, దయ, సత్యము, మొదలగు గుణలేని వారు. పాండ పులకు బలపరాక్ర మాదులకు తగినట్టు సత్య శౌచములు,నీతి న్యాయములు, దయాదర్మము, శాంత్యా దార్యయములు గలవు. లోకము మంచి వారిని "ప్రేమించుటయు చెడ్డవాని నసహ్యించుటయు సహజము కదా" ! ఎల్లరును పాండవులుసదర్ములని వారి మేలు కోరుచుందురు, ధనద్రవ్యముల కాపేక్షించువారును నుపకారములకోరువారును మాత్రము కౌరవుల మైత్రిని చేయుచుందురు. తనపుత్రులకన్న ధర్మరాజు బుద్ధిమంతుడనియు తగినవాడనియు యోచించి ధృతరాష్ట్రుడనిని యువరాజుగజేసి తండ్రి లేని లోటు లేకుండ పొండవుల నాదరించుచుండెను.

దుర్యోధనునకు ధర్మరాజు యువ రాజగుట యెంతమాము నిష్టము లేకుండెను. కౌరవులందరును నొకటేయాలోచన కలవారైరి. వారందరును క్రూరులే కావున పాండవుల నేయుపాయము చేకనైన వంచించి పరాభవించు యేకాక రహస్యముగ చంపించు టకుకూడ ప్రయత్నము చేయుచ్పుడిరి. అయినను పొందవులు పరాక్రమము చేతను బలము చేతను బుద్ధి చేతను నీతి వలనను కూడ కౌరవులకన్న నధికులు కనుక వారి మాయోపొయముల చే చిక్కక తప్పించుకొనుచుండిరి. దుర్యోధనుడు తండ్రితో "మొర పెట్టుకొని పొంచవులు హస్తీ నాపురమున నుండకుండ వారణావతమున కంపునట్లు చేసెను.కౌరవులున్న చోటనే పొండవులున్న యెడల వారి బుద్ధివి శేషములకును బలప రాక్రములకునువీరు చాలని వారగుటచే లోకులీ సంగతి నెరింగిన తమకు గౌరవము రాదని యూహించిదుర్యోధను డిట్లు చేసెను,


అంతటితోసుయోధనుని యీర్ష్యతగ్గ లేదు. పాండవుల మరణముకోరి యాత డెన్నియో యుపాయములను పన్ను చుండెను, పాండవులుండుటకు వింతయైన లక్క యింటి నొక దానిని కట్టించి వారితో కపట స్నేహమును చేయుచు వారందు కాపురము చేయుచుండగా నొ నాడు రాత్రి వేళ దానికి నిప్పు పెట్టించెను. ధర్మమును నమ్మియున్న