పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/55

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీవు నా పెదవులు విప్ప, నేను నీ స్తుతులు పలుకుతాను అంటాం. నీవు నాకు సహాయం చేయడానికి రమ్మ అని వేడుకొంటాం. జపం దేవుడు దయచేసేవరం. మామూలుగా మనం లోక వస్తువులకు అంటిపెట్టుకొని వుండిపోతాం. ప్రార్థనకు కాలాన్ని వెచ్చించాలి. మనకు ఇష్టమైన వాళ్లతో ఎంతకాలమైనా గడుపుతాం. దేవునితో గూడ కాలం గడపితే అతడంటే మనకు ఇష్టమని రుజువెతుంది. ఆ ప్రభువు రోజూ మనకు 24 గంటలు దయచేస్తాడు. ఆ కాలంలో కొంత భాగం అతని సమక్షంలో గడపడం న్యాయం గదా! జపం వల్ల ఆర్థిక లాభాలు కలగవు. కనుక కొంతమంది జపంలో గడిపిన కాలాన్ని మరేదైనా లాభదాయకమైన పనిలో గడిపితే మేలు కదా అనుకొంటారు. ఇది పొరపాటు. జపం వల్ల దేవుని అనుగ్రహాన్ని సంపాదిస్తాం. దానితో ఏ లాభాన్నయినా పొందవచ్చు. దైవానుగ్రహం అన్నిటికంటె పెద్ద లాభం కదా? అందుచే జపానికి కాలాన్ని వెచ్చించడానికి వెనుకాడకూడదు. జపం వల్ల దేవుని చిత్తానికి లొంగుతాం. జపం వల్ల మన బాధలు తొలగిపోవు. వాటిని భరించే శక్తిని పొందుతాం. అది చాలు. ప్రార్ధన వల్ల దేవుని చిత్తాన్నీ ప్రణాళికనూ మార్చం. మనమే మారతాం. అతడు మనం అడిగినట్లుగా చేయడు. మనమే అతడు కోరినట్లుగా చేస్తాం. క్రీస్తు ప్రార్థనలోని ટંગ ముఖ్యాంశం దేవుని చిత్తానికి లొంగడమే -మార్కు 14,36. ప్రార్థనలో భగవంతుడు రుచి తగలాలి. పండ్లు మిఠాయి కూరలు మనకు రుచి తగులుతాయి. వాటిని ప్రీతితో ఆరగిస్తాం. ఈలాగే జపంలో భగవంతుడు రుచి తగలాలి. అనగా అతడు వ్యక్తిగతంగా అనుభవానికి రావాలి. అదే శ్రేష్టమైన ప్రార్ధనం. మన పనిని గూడ జపంగా మార్చుకోవాలి. రోజంతా ప్రార్ధన చేయలేం, పనిచేస్తాం. ఈ పనిని గ్రూడ జపంగా మార్చుకొంటే రోజంతా