పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/32

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన ప్రాంతంలోని గృహస్థులు తిరుసభ వద్యమాల్లో ఇంకా చురుకుగా పాల్గొనడం ඒකී. వీళ్లు చక్కని తర్ఫీదు పొంది గురువులు మొదలైన పాలకవర్గంతో కలసి తిరుసభ వ్యాప్తికి ఎంతో కృషి చేయాలి. ఇక్కడ ఐదంశాలు పరిశీలిద్దాం. 1. గృహస్టులను గూర్చిన దైవశాస్తాంశాలు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లంతా ప్రవక్త, యజాకుడు, పరిపాలకుడు అనే క్రీస్తు మూడు లక్షణాలను స్వీకరిస్తారు. గృహస్థులకు కూడ ఈ లక్షణాలు వర్తిస్తాయి. కనుక వాళ్లు కూడ ప్రజలకు ప్రభువును తెలియజేయాలి. అతని ద్వారా జనాన్ని పవిత్రులను చేయాలి. జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం అనే సంస్కారాల ద్వారానే గృహస్టులు పవిత్ర ప్రజ, ఎన్నికైన జాతి, దేవుని అద్భుత కార్యాలను ప్రకటించే వాళ్లు ఔతారు - 1పేతురు 2.9. దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించడం ద్వారా గృహస్టులు దైవప్రేమను సోదరప్రేమను పొందుతారు. ఈ ప్రేమశక్తి వాళ్లను ప్రేషిత సేవకు పురికొల్పుతుంది. క్రీస్తుని బోధించడమే ప్రేషిత సేవ. ఆత్మ వారికి వ్యక్తిగతమైన వరాల నిస్తుంది -1కొరి 12, 7-11. ఈ వరాలతో వాళ్లు ప్రజలకు సేవలు చేయాలి. తిరుసభను ఓ భవనం లాగ నిర్మించాలి. గృహస్థులకు శక్తి క్రీస్తునుండే వస్తుంది. వాళ్లు క్రీస్తనే ద్రాక్ష తీగలోకి రెమ్మల్లాగ ఐక్యమై ప్రభువునుండి దివ్యశక్తిని పొందుతారు. క్రీస్తు శక్తి లేకపోతే వాళ్లంతట వాళ్లు ఏమీ చేయలేరు -యోహా 15, 5. వారి పనులన్నీ క్రీస్తు పేరిట చేసేవే -కొలో 3, 17 ఈలా క్రీస్తు ద్వారా తాము పవిత్రులై ఇతరులను గూడ పవిత్ర పరచడానికి శక్తిని పొందుతారు. గృహస్తులు ప్రధానంగా లౌక్తిక్ష రంగంలో పనిజేసేవాళ్లు. పులిపిడి