పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/109

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దప్ప మరొకటి నాకు రుచించదు –73,25. అందరూ మోక్షానికి పోవాలనే కోరుకొంటారు. అక్కడ యేముంటుంది? ప్రభువే కదా! ప్రభువే నాకు వారసభూమి, పానపాత్రం. లేవీయులకు, ఇతర యిస్రాయేలుతెగలకు లాగ కనాను దేశంలో భూమిలేదు. దేవుడే వాళ్ల భూమి. వాళ్లు దేవాలయంలో సేవలు చేస్తు అక్కడ భక్తులు అర్పించే కానుకలు తిని బ్రతకాలి. భగవంతుడే భక్తులకు అన్నపానీయాలు అని భావం. వాళ్లు కేవలం అతనిమీదనే ఆధారపడి జీవిస్తారు -16, 5. ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు –23, 1. కాపరి మందను కాచికాపాడినట్లుగా ప్రభువు భక్తులను కాపాడతాడు. మన అక్కరలన్నీ తీరుస్తాడు. నాకు నిర్ణయింపబడిన దినాలన్నీ అవి యింకా ప్రారంభం కాకమునుపే, నీ గ్రంథంలో లిఖింపబడి వున్నాయి –139, 16. మన భవిష్యత్తు మనకు తెలియదు. దేవునికి తెలుసు. అతనికి తెలియకుండ అతడు అనుమతించకుండ మనకు ఏ కీడు కలగదు. దేవునికి మనపట్ల ప్రేమతో గూడిన ఆలోచనలు వుంటాయి. వాటి సంఖ్య యిసుక రేణువుల్లాగ లెక్కలకు అందదు -1:39, 18. నీవు నాకు దీపం వెలిగిస్తావు. నా త్రోవలోని చీకటిని తొలగిస్తావు - 18,28. దేవుడు మనకు సర్వశుభాలు దయచేసి మన వెతలన్నీ తీరుస్తాడు. అతని వలన మనం పరమానందం చెందుతాం. ఈ సందర్భంలో మన దైవానుభూతిని కూడ జ్ఞప్తికీ తెచ్చుకోవాలి. జీవితంలో కొన్ని పర్యాయాలు మనకు గాఢమైన భక్తి పుట్టి వుంటుంది. ෂයී దైవానుభూతి. ఆలాంటి సందర్భాలను గుర్తుకు తెచ్చుకొన్నపుడు హృదయం స్పందించి ప్రశాంతిని పొందుతుంది. దేవుని ఆత్మ మనతో మాటలాడుతుంది. ఆ సంఘటనల్లోని లోతైన భావాలు అనుభవానికి వచ్చి భక్తి బలపడుతుంది.