ఈ పుట ఆమోదించబడ్డది

భూస్వాములు వంశపారంపర్యాయతాసభ్యత్వముల బొందియున్నారు. ఇటులనే జపానునందు చక్రవర్తి యొకరుకలరు. ప్రభువుల సభయందు భూస్వాములు శాశ్వతపు సభ్యత్వముల కల్గియున్నారు.సయామునందు రాజు, పర్షియాయందు షా, ఇటలీయందు రాజు కలరు. కాని పురాతన కాలపు రాజ్యాంగముల లాంఛనము లిప్పటికి నీరీతిగా కొన్ని రాజ్యాంగములందు మిగిలియున్నను వెనుకటి కాలమందు వీనికి గల ప్రాముఖ్యత యిప్పుడు లేదు.

ఏదేశమున కెట్టి రాజ్యాంగవిధానముకలదో దెల్పుటకు, రాజ్యాంగవిధానపు చట్టమొకటి స్థిరపరచుట యీదినములందు వాడుకయైనది. కాని, రాజ్యాంగవిధానపు చట్టములనేర్పరచుట ఆదిమకాలపు గ్రీసుదేశపురాజ్యములకుకూడ తెలిసియుండెను. ఏథెన్సునగరరాజ్యమునకుమూడు మారులు రాజ్యాంగవిధానపు చట్టములేర్పడెను. కాని, పురాతనపు హిందూదేశమునందువలెనే, రోమనుప్రజాస్వామిక రాజ్యమందును, రాజ్యాంగ విధానస్వరూపము ఆకాలపు ఆచారముల వలనను, కట్టుదిట్టములవలనను, పవిత్రముగా పరిగణింపబడుచుండిన కొన్ని శాసనములవలనను మాత్రము నిర్ణీతమగుచుండెనేకాని చట్టరూపము పొందలేదు. మనసూత్రకాలమందలి రాజ్యమునందు, భారతయుద్ధకాలము వరకుండిన రాజ్యము