పుట:Adhunikarajyanga025633mbp.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యందున్న బీదలు, కార్మికులు, తమతమస్వత్వముల వృద్ధిపరచుకొనగోరి ధనికులు భూస్వాములకు కల్గుప్రత్యేక హక్కులు అవకాశములు అక్రమముగా సంక్రమించుచున్నవని తెలుసుకొనకున్నారు. ధనికులు అదృష్టజాతకులనియు వారితోనేదే నొకవిధముగా సంబంధము, బాంధవ్యము, సాహచర్యము, నెరపుట గౌరవప్రదమనియు, బీదలందెక్కువమంది తలంచుచున్నారు. ధనికులుపోషకులుగానున్న సంఘములందు భూస్వాములు సభ్యులుగానున్న సంస్థలందు ధనికులు భూస్వాములు తదితరులతో కలసిమెలసి సంచరించుచుండు వ్యవహారములందు ఏదో యొకవిధముగా చేరుటే గొప్పతనమను పిచ్చిభ్రమకు ప్రజాసామాన్యమింకను ఎల్లదేశములందును లోనైయున్నది. ప్రస్తుతపు సాంఘికార్థిక రాచకీయపు టేర్పాటులు కాకులనుకొట్టి గద్దలకు వేయునట్లు తమ్మునిరసపరచి అల్పసంఖ్యాకులగు భూస్వాముల, కర్మాగారాధిపతుల, ధనికుల బలపరచుచున్నను రహస్యమును బీదలుగ్రహింపజాలకున్నారు. ఇట్టిపరిస్థితులందు వోటరులందింకను అధికసంఖ్యాకులు వివిధదేశములందు లిబరలు కన్సర్వేటివు పక్షీయులకే వోటుల నిచ్చుచున్నారన్న ధనికులకు భూస్వాములకు చెందినమంత్రివర్గములు బలిష్టతబొంది పెత్తనమునకు వచ్చుచున్నవన్న ఆశ్చర్యమేమి? ఈవిధముగ తమప్రతిభ అప్రతిహతముగ సాగుచున్నప్పుడు ప్రజాప్రతినిధిసభవారు తమ్ముమించి తమస్వత్వము