పుట:Adhunikarajyanga025633mbp.pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

పైన యుదహరింపబడిన లెఖ్ఖలబట్టి, ఇంగ్లాండునందలి వివిధరాచకీయపక్షములు, తమకు దేశమందుగల పలుకుబడికి తగినట్లు, పార్లమెంటులో ప్రాతినిధ్యము పొందలేదనియు, ఒక్కొక్కయెన్నికయం దొక్కొక్కపార్టీవారు, అత్యమితమగు ప్రాముఖ్యతను పార్లమెంటునందు పొందుచుందురనియు, ప్రజలయందు ఆప్రాముఖ్యతకు తగిన పలుకుబడి, ఆపార్టీవారికి లభ్యముగాకుండుట సత్యమనియు తెలియనగును. క్రీ. శ. 1924 సంవత్సరమందు జినోలైఫ్ లెఖ్ఖను, డెయిలీ మెయిల్ పత్రికాధిపతులు సృష్టించి, లేబరుపార్టీవారు రషియను ప్రభుత్వమునకు, బ్రిటిషురాజ్యాంగమును లోపరచ బోవుచున్నారని అసత్యప్రచారముజేసిరి. అంత, ప్రతినియోజకవర్గమందును, అధిక సంఖ్యాకులగువోటరులు కన్సర్వేటివుపార్టీ వారికి తమ వోటులనొసంగి, కన్సర్వేటివు అభ్యర్థులను జయప్రదులజేసిరి. మరికొన్నినియోజకవర్గములందు, లిబరలు, లేబరుపార్టీల అభ్యర్థులుకూడ నిలబడుటచే, అల్పసంఖ్యాకమగు వోట్లతోడనే, కన్సర్వేటివులు జయమందిరి. ఈవిధముగా లిబరలు, లేబరుపార్టీలకు, మొత్తముమీదహెచ్చువోటులు, దేశమం దంతట వచ్చినను, ఎన్నికఫలితములందు మాత్రము వానికి 176 స్థానములు చేకూరగా కన్సర్వేటివులకు 382 స్థానములు సంప్రాప్తించెను. ఇదేవిధముగా 1931 సంవత్సరమునందును శ్రీఫిలిప్సుస్నోడనుగారుపెట్టిన ఆర్థికసంక్షోభభయముచేత, ప్రజలెల్లరు