ఈ పుట ఆమోదించబడ్డది

గొంత సంభాషణ జరిగినమీద నాబ్రహాము "మన మితరుల యారోపముల గైకొని యాగ్రహింపకున్న వా రూర కుందుర" ని బుద్ధి చెప్పెను. ఈ లోపల నా బాలులు ప్రశాంతులైరి. దుడుకుతనమున గల్లరి యనిన వా డాపదప్రయోగమునకు జింతించుట సూచింప నాబ్రహాము వానిని గొని యాడి మరల వారి నెప్పటివలె స్నేహితుల జేసెను.

ఏడవ ప్రకరణము

కృషి, సంపాదనలు.

ఆబ్రహాము లింకనున కిరుగుపొరుగున నుండు జనులెల్ల మిక్కిలి మూడులు. మన దేశమున గొందఱబలె మంత్ర తంత్రములయు దత్యాదరము గలవారు. మంత్రకారులు మంత్రకత్తెలు మనల దమ వశము చేసికొందు రనియు, నందులకు బ్రతిక్రియ వారి ప్రతిమల జేసి యవ్వాని వెండిగుండునం గాల్చుటయే యగుననియు నమ్ముచుందురు. ఎవడైన వేట వెడలునప్పుడు దారిని గుక్క యడ్డుపడిన మిక్కిలి కష్టసూచక మనియు, నద్దాని నివారణార్థము నడిమి వ్రేళ్ల బెనవేసి యా కుక్క కనుమఱగువఱకు లాగుకొనుచుందురు. కొందఱు మాంత్రికులు మంత్రపూరితదండముల గొని భూమిలోని ప్రజల ద్రవ్య సముదాయముల జూపెదమని జనుల భ్రమింప