ఈ పుట ఆమోదించబడ్డది

రము గాకున్నను 'జంతుహింస' ఖండించుచు జిన్న వాక్యములు మొదటమొదట వ్రాసి తరువాత నొక పెద్ద యుపన్యాసము వ్రాసి చదివెను. అతని జ్ఞాపకశక్తియు ననన్య సామాన్యము. చదివినభాగము లనేకము లొక్కవిధమున గథనము సేయుచుండును. అతనివాగ్ధోరణియు నపారముగ వృద్ధిబొంద దొడగెను. కవిత్వమునగూడ నతడు గొంచెముగొంచెము పరిశ్రమ సేయుచుండెను.

ఆబ్రహాము బాల్యమునుండి దయామయుడు. కొందఱు బాలు రొకతా బేటివీపున నగ్గినిడి దాని వేధించుచుండిరి. ఆ యగ్గి దనవీపున నిడిన నెంతబాధ గలుగునో యంతబాధ నొంది యతడు.

"అటు చేయకు మటుచేయకు" మని యఱచెను. అందొకడు "ఎటుచేయకు మెటుచేయకు" మని వెక్కిరించుచు నా తాబేటి నొక కఱ్ఱతో నడచెను.

"అంత శౌర్యము వలదు. నీ వీపున జిచ్చిడిన నీ వేలాగుందువో యోచింపు" మని యాబి నుడివెను.

దానికి మఱియొక:డు "ప్రయత్నించి చూడు" మని కేక లిడెను.

"ఆప్రకార మాజంతువు నలయించుట దౌర్జన్యంబును నీచత్వము నగు" నని యాబ్రహాము గట్టిగ బల్కెను.