ఈ పుట ఆమోదించబడ్డది

    నాదు హర్మ్యంబు గలుగు నా నాకమందు
       నదియ సౌభాగ్య గరిమంబు లందజేయు;
    నదియ నా మన మానందమందు ముంచు;
       నదియ యెల్లప్పు డగు నాకు నభవుగృహము

"మీకడ దానము గొన్నది మొద లీకీర్తన నే మనస్సంతోషమున బాడ లేకున్నాడను. మీభూమి మీరు గొనుడి నా కమెరికాఖండ మంతయు నిచ్చిన నే నొల్ల. నాకీర్తన నే బాడు కొనియెద" ననియెను.

ఇట్టివారితో సాంగత్య మప్పుడప్పుడు ఆబ్రహామునకు దటస్థించుచుండెను. వారు చెప్పినవిషయములును వారి చరిత్ర విశేషములును అతని మనమున నాటి యాతని యుత్కృష్ట పదవికి దారిజూపెను. నిర్మల మనస్కు లై నిజ మరయుచు బై పూతల దిరస్కరించి సద్గుణముల నలరారు పురోహితులు లోకమున కెంత మేలు గలుగ జేయనేరరు?

చదువరులారా! మన కిప్పు డిట్టి యాచార్యులు గావలయును. లోకమును మోసపుచ్చు పై వేషముల జూచి భ్రమయ:బోకుడి. మనోనైర్మల్యంబును గార్యథురంధరత్వమును దేశ క్షేమము పై దృష్టియు గల మహనీయులకు జన్మబలంబు గాని ద్రవ్యబలంబుగాని మిథ్యాశాస్త్రబలంబుగాని యనవసరంబు కావున నీ బహి:పటాటోపము చూపు డాంబికుల నిర