ఈ పుట ఆమోదించబడ్డది

వారికి విడువని మిత్రులు. పల్లెనుండి పల్లెకు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతమువఱకు దిరిగి యుపన్యసించుట వారి పని. తమ యుపన్యాసముల మార్గమున సిద్ధపఱచుకొను చుందురు. ఎచ్చట సాయంతన మగు నటన వారికి విడిది. ఒక్కొక సమయమున మనుష్యసంచారభూమికి నెన్నియో మైళ్లదూరమున నాకసము గప్పుగ భూమిశయ్యగ వారు నిద్రింతురు. వారికి జీతమిచ్చువా రొక్కరు నుండరైరి. అందు బలువురు కట్టుటకు మంచిబట్టలును, దినుటకు రుచ్యమగు నన్నమును గోరక దైవభక్తిచే లోకమున కుపకార మొనరించుచుందురు. అం దొక్కరివిషయము వినుడు.

ఒక పురోహితుడు నిరుపేద దనస్థితికి వగవక ప్రయానపడి తిరుగుచు నితరులకు జ్ఞానప్రదానము సేయుచుండెను. అతని దైవభక్తికిని, నైర్మల్యంబునకును మెచ్చి యొక భక్తుడు భూస్వామి యతనికి 320 యెకరముల క్షేత్రము దాన మిచ్చి దానపత్రము వ్రాసి చేతి కిచ్చెనట. అతడు సంతసించి దాని దీసికొని కృతజ్ఞత సూచించి వెలువడిపోయెను. పోయి మూడు మాసములకు మఱలివచ్చి దానపత్రమును దిరిగి భూదాత కియ్య బోయెను. ఆ భూస్వామి యాశ్చర్యమును భయమును పెనగొన,

"అం దేమైన లోపమున్నదా" యన