ఈ పుట ఆమోదించబడ్డది

యవస్థ జూచి యోర్చుట యసాధ్య మాయెను. ఋజబాధ మిక్కిలి యెక్కుడాయెను. ఆప్రాంతములనుండు నబలలెల్ల రామెకు సాయ మొనర్ప నేతెంచిరి. దిగులంది సహాయార్థము ఉడ్డుగారింటి యాడువారి గొనిరా బరుగిడియెను. వారిలో గొంద ఱనుభవముచే రోగుల గాపాడుటయందు సమర్థు లుందురు. అయిన దైవసాహాయ్యము లేనియెడ మనుజసాహాయ్య మెంతయుండిన నేమిఫలము? తగిలిన యైదుదినములలోపల నాంసీ పరలోకప్రాప్తి జెందెను. అచటిజనుల దు:ఖ మంతింత యని నుడువజాలము. లింకనులకు గలిగిన నష్ట మపారమయ్యెను. వారి మనములు నిండి దు:ఖము వెల్లివిఱియ జొచ్చెను. నిర్మానుష్యాటవికల్పమగు నాసీమయం దడగి సద్గుణోపేతుండగు నాబ్రహామున కాసుశీలయగుతల్లి దనువాసి పరమపదం బందిన నెంత మనోవైకల్యంబు సంభవించెనో నుడివిన దీరదు. చదువరుల యూహింతురుగాక. ఇట్టి కట్టడి విధి సంప్రాప్త మైన వారి యెక్కటికము దుర్వహమై తోచక మానదు. ఆబ్రహాము మాటలాడ నోరాడక తనతల్లివిషయ మెత్తుటయే మాని దిగ్భ్రమ జెందినవానివలె ముఖవర్చస్సు గోలుపోయి తిరుగుచుండెను.

ఆమెకు సమాధి యొనర్చుట కేర్పాటులు సేయబడియెను. థామసు దనచేతన భార్య కళేబరం బుంచుట కొకపెట్టె