ఈ పుట ఆమోదించబడ్డది

కొని క్రమేణ యిల్లు గట్టుకొన నిశ్చయించుకొనెను. కావున గొంతకాలము వారు ముప్ప్రక్కలమాత్ర మావరణమును నాలవప్రక్క మార్తాండవాయువుల రాకపోకల కనుకూలంబగు బయలును గలగేహంబున నివసింపవలసి వచ్చెను. అతి శీతలదేశమున నిట్టిబ్రతు కెంతకష్టమో యూహింపవలసినదేగాని వర్ణింప నలవిగాదు. వర్షాతపములకు నోర్చుట వారి కంతటి దుస్సాధ్యములోనిది కాదు. వా రట్టికష్టములకు వెనుదీసి యుండినచో నభివృద్ధి యెచ్చటనో దాగియుండును.

ఆబ్రహాము దండ్రి 1817 వ సంవత్సరము శిశిరఋతువు నందు సామగ్రియంతయు సమకూర్చుకొని వసంతంబున విత్తునాటినపిదప నిల్లు కట్టుకొన మొదలిడెను. ఉపకరణముల నాయత్తపఱచుటయం దతనిపుత్రుండు రంపముపట్టుట కొయ్యల నఱకుట మొదలగుపనులు సేయుచు వచ్చెను. ఆకుటీరము నప్పుడప్పుడు చూచుచుండినవా రొకరు దాని నీప్రకారము వర్ణించి యున్నారు.

"అది 18 అడుగుల పొడవును 16 అడుగుల వెడలుపును గలది. నడునేల పూతలేమియు లేక యెక్కుడుదిగుడు లగు భూప్రదేశము. ఇంటిగోడలు సూచితిరే! ఒకటిపై నొకటిగ బంధింపబడిన దుక్కలు. వానిని మూలల జక్కగ జంటించి నెరయలమట్టితో గప్పివైచి యుందురు. దానికప్పు వసారా